ఆంధ్రావారు బాగున్నారా?, బాబుకు అదే చెప్పా: మోడీ, 'పవన్‌తో జాగ్రత్త!'

అమరావతి: ఏపీకి మరిన్ని నిధులు ఇస్తామని, విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా అదే చెప్పామని ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ బీజేపీ నేతలతో వ్యాఖ్యానించారు.

ఎవరేమనుకున్నా రాష్ట్ర అభివృద్ధే అజెండాగా పని చేస్తున్నామన్న విషయం ప్రజలకు వివరించాలని మోడీ వారికి సూచించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఏపీని ప్రత్యేక దృష్టితో చూస్తున్నామన్నారు. ఆ విధంగానే అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చామనీ, నిరంతరం సహకారం కొనసాగుతుందన్నారు.

రిలయన్స్-గుజరాత్ : హోదా ఇవ్వకపోవడం వెనుక కొత్త అనుమానం

ఆంధ్రప్రదేశ్‌లో అనేక వనరులు ఉన్నాయనీ, ఆ రకంగా రాష్ట్రం దేశానికి చాలా ఇవ్వగలదన్నారు. బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ సిద్దార్థనాథ్‌ సింగ్‌, రాష్ట్ర అధ్యక్షులు కంభంపాటి హరిబాబు, ఇతర నేతలు శనివారం ప్రధానిని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ వారితో పలు అంశాలు చెప్పారు.

ఆంధ్రావారు బాగున్నారా?

ఆంధ్రా వారు బాగున్నారా అని చిరునవ్వుతో ప్రధాని మోడీ పలకరించారు. మహిళా నేతలు ఎవరూ రాలేదేమిటని అడిగారు. ప్యాకేజీపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్యాకేజీ నచ్చినా నచ్చకపోయినా అభివృద్ధే అజెండా కాబట్టి ఏపీకి నిరంతర సహకారం ఉంటుందని మోడీ చెప్పారు.

PM Modi Meets Andhra BJP Leaders, Urges

ఏపీ ప్రజలది కష్టపడే మనస్తత్వమని, చంద్రబాబు లాంటి సమర్థ ముఖ్యమంత్రి ఉన్నారని, పారిశ్రామికవేత్తలు ఉన్నారని, మౌలిక వసతులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర నుంచి విడిపోయినప్పుడు నీరు, విద్యుత్తు కూడా గుజరాత్‌కు లేవన్నారు. ఉప్పు అమ్ముకొని బతికామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మీద తనకు విశ్వాసం ఉందన్నారు. దేశంలో తొలిస్థానంలో ఏపీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయిందేదో అయిపోయిందని, విభజన జరిగిందని, అదే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాగని, అభివృద్ధిలో దూసుకెళ్లాలన్నారు. విడిపోయామన్న విచారం వద్దన్నారు.

టిడిపితో కలిసి వెళ్లాలని అమిత్ షా సూచన

టిడిపితో కలిసి పని చేయాలని బిజెపి నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సూచించారు. మిత్రపక్షంతో ఇష్టపడి పని చేయాలన్నారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిందని, ఇంకా సహకరిస్తామని హామీ ఇచ్చిందన్నారు.

వెంకయ్యనంటావా, పీఆర్పీ-2, తిరుపతి లడ్డూలు: పవన్‌పై బీజేపీ ఎదురుదాడి

ప్రజల్ని పక్కదోవ పట్టించే వారు ఉంటారని, అలా జరగకుండా చూడాలని బీజేపీని నిలదీస్తున్న వైసిపి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, జనసేనలను ఉద్దేశించి అన్నారు.

ప్యాకేజీపై రాష్ట్రంలో టిడిపి, బిజెపి కలిసి ఓ ప్రకటన చేయండని సూచించారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందనేది ప్రజలకు చెప్పాలని అమిత్ షా సూచించారు. ఈ సందర్భంగా వారు రైల్వే జోన్ అంశాన్ని ప్రస్తావించారు. జోన్ ఇస్తే రేపటి నుంచి ఏం అడగకుండా ఉంటారా.. కాబట్టి ఒక్కొక్కటి అమలు చేస్తామని చెప్పారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+