ఎన్టీఆర్ జయంతి వేళ.. ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

నేడు.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 102వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోన్నారు. ఏపీలో అధికార టీడీపీ మహానాడును జరుపుకొంటోంది.

మహానాడు రెండవ రోజు ప్రతినిధులు సభ జరుగనుంది. తొలి రోజైన మంగళవారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానాలను నేడు సభ ఆమోదించనుంది. చివరి రోజైన గురువారం నాడు దాదాపు అయిదు లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ మహానాడు ప్రాంగణంలోనే బస చేశారు.

PM Modi pay tributes to former CM NTR

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్.. ఆయనకు నివాళి అర్పించారు. ఈ ఉదయం వాళ్లు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ ను అలంకరించారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రానున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

కాగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. సమాజానికి సేవ చేయడానికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకున్నాయని పేర్కొన్నారు.

సినిమా మాధ్యమంగా ఎన్టీఆర్.. యావత్ సమాజాన్ని చైతన్యవంతులు చేశారని మోదీ చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే సమాజంలో స్ఫూర్తినింపే సినిమాలు తీశారని అన్నారు. తాము అందరం ఎన్టీఆర్ నుండి ఎంతో ప్రేరణ పొందామని మోదీ నివాళి అర్పించారు.

తన స్నేహితుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఏపీలో అదికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఎన్టీఆర్ ఆశయాలను సాధించడానికి, ఆయన దార్శనికతలో ప్రయాణించడానికి నిరంతరాయంగా కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+