అమరావతి రైతులకు మోడీతో సన్మానం-మే 2న సభకు భారీ ఏర్పాట్లు..!

ఏపీలో రాజధాని అమరావతి పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు భారీ స్దాయిలో కసరత్తు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. వీటికి ప్రధాని మోడీని ముఖ్య అతిధిగా ఆహ్వానించింది. ఈ మేరకు మే 2న ప్రధాని మోడీ అమరావతి రాజధాని పనుల తిరిగి ప్రారంభానికి రాబోతున్నారు. ఈ సభకు 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ఓ మంత్రివర్గ కమిటీనే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్దాయిలో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.

రాజధానిలో ప్రధాని పర్యటన వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రి నారాయణ,ఉన్నతాధికారులు ఇవాళ పరిశీలించారు. ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లు 90 శాతం పూర్తయ్యాయని నారాయణ తెలిపారు. వచ్చే నెల 2న మోడీ చేతుల మీదుగా అమరావతి పనుల పునః ప్రారంభం అవుతాయన్నారు.సభా వేదిక వద్దకు వచ్చేందుకు అవసరమైన రోడ్లను గుర్తించామని, 11 పార్కింగ్ ప్రాంతాలు,8 రోడ్లను గుర్తించామని ఆయన తెలిపారు.

pm modi to felicitate amraravati farmers who give lands to capital on may 2

కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాలు భూమిని రైతులు ప్రభుత్వానికి ఇచ్చారని, కాబట్టి ప్రధాని సభ వద్ద రైతులను గౌరవించాలని సీఎం చెప్పారని మంత్రి నారాయణ వెల్లడించారు. మొత్తం మూడు స్టేజ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ప్రజలు ల్యాండ్ పూలింగ్ కు అంగీకరిస్తే చేస్తాం లేని పక్షంలో భూసేకరణ ఆప్షన్ ఆలోచిస్తామన్నారు.

pm modi to felicitate amraravati farmers who give lands to capital on may 2

హైదరాబాద్ లో ఒక ఎయిర్పోర్ట్ ఉందని, అయినా శంషాబాద్ నిర్మించామన్నారు. ఇప్పుడు రెండవ ఎయిర్ పోర్ట్ లేకుండా ఉంటే హైదరాబాద్ లో ఇప్పుడు 10శాతం విమానాలు కూడా దిగేవి కావన్నారు. రానున్న 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని సిఎం అమరావతి నిర్మాణం చేస్తున్నారన్నారు. పెరిగిన భూముల విలువ నిలవాలన్నా,పెరగాలన్నా ప్రజలు ఉండాలన్నారు. ప్రజలు లేకపోతే భూముల విలువ పడిపోతుంది.స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే అభివృద్ధి అన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటేనే స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తాయని నారాయణ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+