• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో 20 మంది అరెస్ట్ - రెచ్చగొడితే చర్యలు తప్పవు : రాజకీయంగా..!!

|
Google Oneindia TeluguNews

ప్రశాంతంగా ఉండే కోనసీమలో చోటు చేసుకున్న విధ్వంసంతో అందరూ ఉలిక్కి పడ్డారు. గత నెల 24న జరిగిన ఆందోళనలు - విధ్వంసం లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అనేక మార్గాల ద్వారా ఆ విధ్వంసానికి కారకులైన వారిని గుర్తిస్తున్న పోలీసులు తాజాగా మరో 20 మందిని అరెస్ట్ చేసారు. దీంతో..ఇప్పటి వరకు ఈ ఘటనలో అరెస్ట్ చేసిన వారి సంఖ్య 111కి చేరింది. ఇక, జిల్లా వ్యాప్తంగా అదే రోజు నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేసారు. వాట్సప్ సందేశాల ద్వారా ముందుస్తుగా సిద్దం చేసుకున్న ప్రణాళిక మేరకు అల్లర్లకు పాల్పడినట్లుగా విచారణలో తేలింది.

కొనసాగుతున్న అరెస్టుల పర్వం

కొనసాగుతున్న అరెస్టుల పర్వం


దీంతో.. ఆ రోజు నుంచి ఇప్పటికీ ఇంకా కొన్ని మండలాల్లో ఇంటర్నెట్ సేవల పైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాగా, కొన్ని మండలాల్లో మాత్రం పునరుద్దరించారు. అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం, అల్లవరం మినహా మిగతా మండలాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా అమలాపురంలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. సున్నితమైన అంశం కావటంతో.. పోలీసులు విచారణ సమయంలో.. నిర్ధారణకు వచ్చిన అంశాల్లో నూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాజకీయంగానూ ప్రభుత్వం పైన ఈ ఘటన పైన ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి.

విధ్వంసం .. రాజకీయ విమర్శలు

విధ్వంసం .. రాజకీయ విమర్శలు


ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టింగులు పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ.. కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. నిరసన కారులు బస్సులను దగ్ధం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయి. ఇప్పటికే విధ్వంసంలో పాల్గొన్న టీడీపీ - జనసేనకు చెందిన వారి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసారు. ఇక, ఇప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్..ఇదంతా కోనసీమలో వైసీపీకి చెందిన రెండు వర్గాల మథ్య ఘర్షణగా ఆరోపిస్తున్నారు.

పోలీస బందోబస్తు.. ఆచితూచి నిర్ణయాలు

పోలీస బందోబస్తు.. ఆచితూచి నిర్ణయాలు


ఇందులో ఇతరులకు సంబంధం లేదని చెబుతున్నారు. మంత్రి విశ్వరూప్ సైతం ఈ ఘటనలో బాధితుడే అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఈ ఘటన పైన సీఎం జగన్ ఎందుకు స్పందించలేదని..డీజీపీ ఎందుకు ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లలేదని నిలదీస్తున్నారు. అటు వైసీపీ నేతలు సైతం ఈ ఘటన వెనుక టీడీపీ - జనసేన ఉందంటూ కౌంటర్ విమర్శలు చేస్తున్నారు. ఇక, పోలీసులు కోనసీమలో తిరిగి ఎటువంటి అలజడికి అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ పోలీసు అధికారులు అక్కడే మకాం వేసి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు.

English summary
Twenty persons who accused in Amalapuram Violence arrested by police, with this total 111 persons arrested in this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X