అర్ధరాత్రి తాడేపల్లిలో ఏపీ సచివాలయ ఉద్యోగుల నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్
K Venkatrami Reddy: ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మద్యం పార్టీని నిర్వహించినందుకు ఆయనను ఎక్సైజ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవుల కోసం త్వరలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ డైరెక్టర్ పదవుల్లో తమ వాళ్లను గెలిపించుకోవాలనే ఉద్దేశంలో వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు ప్రలోభ పెట్టారనే కారణంతో అరెస్ట్ చేశారని అంటున్నారు.

గురువారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్‌లో వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగులకు మందు, విందు పార్టీని ఏర్పాటు చేసినట్లే పక్కా సమాచారం అందడంతో ఎక్సైజ్ అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి దాడులను నిర్వహించారు. అనుమతులు లేకుండా మందు పార్టీని నిర్వహించడంతో ఆయనను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
సచివాలయం క్యాంటీన్‌లో మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 28 మంది పోటీలో నిలిచారు. వీరిలో 11 మంది వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన వారు. తన వర్గానికి చెందిన అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో సచివాలయ ఉద్యోగులకు మందు, విందు పార్టీతో ప్రలోభ పెట్టినట్లు వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేశారు.
మద్యం పార్టీని నిర్వహించడానికి ముందస్తు అనుమతులను తీసుకోకపోవడం, ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications