మహిళా ఉద్యోగులనే చేర్చుకుంటాడు...ఆపై అదను చూసి కాటేస్తాడు...విశాఖలో కంపెనీ ఓనర్ అరెస్ట్...

విశాఖపట్నం: అతడో మధ్యవయస్సు వ్యక్తి...ఒక సంస్థ యజమాని...అంతేకాదు సమాజం దృష్టిలో ఓ కంపెనీ నడిపే పెద్దమనిషి...కానీ అతడి నిజస్వరూపం వేరు...అతడి స్నేహితులకు మాత్రమే తెలుసిన నిజం ఒకటుంది...అది అతడో పెద్ద కామాంథుడని...కానీ ఎట్టకేలకు ఆ నీచుడి ఆట కట్టయింది. ఎలా అంటే...

విశాఖపట్టణంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీకి చెందిన దాడిశెట్టి శ్రీనివాసరావు అనే వ్యక్తి ద్వారకానగర్‌ మొదటిలైన్‌లో ఇన్ఫోటెక్‌ ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ అనే సంస్థను నడుపుతున్నాడు. ఇతడి వయస్సు 51 సంవత్సరాలు. ఐదు పదులు నిండిన ఈ వ్యక్తి తన సంస్థలో కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఉద్యోగం ఇస్తాడు. తనకు నచ్చినవారికి మాత్రమే జాబ్ ఇస్తాడు. ఆ వాళ్లకి ఒకరికి తెలియకుండా మరొకరికి మాయమాటలు చెప్పి లోబర్చుకుంటాడు. వాళ్లతో సన్నిహితంగా గడుపుతాడు. ఆ తరువాత తాము ఏకాంతంగా ఉండగా ఫొటోలు, వీడియోలు తీస్తాడు.

Police arrest company owner's for filming woman employees

ఇలా చాలాకాలంగా తన కామక్రీడలు కొనసాగిస్తూ వచ్చిన ఈ కలియుగ కీచకుడు తన గొప్పతనం స్నేహితులకు కూడా తెలియజెప్పాలనుకున్నాడు. అందుకే తాను తీసిన వీడియోలను తన మిత్రులకు షేర్‌ చేశాడు. అవి అలా అలా చేతులు మారి ఆ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగిని భర్తకు చేరాయి. ఈ ఘోరం చూసి హతాశుడైన ఉద్యోగిని భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ నీచుడి ఆటకట్టయింది. అంతేకాదు అతడు ఇప్పుడు దాకా వెలగబెట్టిన కామలీలలన్నీ బైటకు వచ్చాయి. అయితే అతడు ఇప్పటివరకు తమకే ఆప్తుడిగా భావించిన మహిళా ఉద్యోగులు అతడు అందరికీ అవే మాటలు చెప్పి మోసం చేశాడని తెలుసుకొని దిగ్భ్రాంతి చెందారు. ఇలాంటి దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. ఫైనల్ గా ఈ నీచ్ కమీనేని విశాఖ నాలుగో పట్టణ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+