కాల్ మనీ: అసలు వడ్డీ తడిసి మోపెడు, తండ్రి అరెస్టు- కుమారుడు పరారీ
విశాఖపట్నం: విశాఖపట్నంలో దశాబ్ద కాలంగా తండ్రీకొడుకులు నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారం వెలుగులోకి వచ్చింది. రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్న మద్యం వ్యాపారి రూ.80 లక్షలు చెల్లించాడు. మరో 45 లక్షలు చెల్లించాలని తండ్రీ కొడుకులు బెదిరించడమే కాకుండా స్థిరాస్తులను తమ పేరిట మార్చుకునేందుకు యత్నించారు.
దాంతో మద్యం వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది. డిసిపి రామ్‌గోపాల్ నాయక్ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశాఖలోని గాజువాకకు చెందిన మద్యం వ్యాపారి కేవీఎస్ ప్రసాద్ జిల్లాలో పెద్ద వడ్డీ వ్యాపారి గోకినేని సుధాకర్ వద్ద 2007 ఆగస్టులో రూ.20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. హామీగా ఖాళీ చెక్కులు ఇచ్చి, ఆస్తి పత్రాలను తనఖా పెట్టాడు.

తర్వాత అసలు, వడ్డీ కలిపి దఫదఫాలుగా 80 లక్షలు చెల్లించినా మరో రూ.45 లక్షలు చెల్లిస్తేనే పత్రాలను ఇస్తానని సుధాకర్ తేల్చి చెప్పాడు. సుధాకర్ కొడుకు సుబ్రహ్మణ్య వెంకట అప్పారావు నుంచి ప్రసాద్ 2008 సెప్టెంబర్‌లో 15 లక్షలు అప్పుగా తీసుకుని ఐదు ఖాళీ చెక్కులు, 387 గజాల ఇంటిస్థలం డాక్యుమెంట్‌ను తనఖా పెట్టాడు.
అసలు, వడ్డీ కలిపి రూ.68 లక్షల వరకు చెల్లించినా మరో రూ. 45 లక్షలు కట్టాలంటూ ఇంటి స్థలాన్ని తన పేరున జీపీ, సేల్ అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సుధాకర్‌పై వివిధ సెక్షనల కింద 36 కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications