హోటల్‌లో వ్యభిచారం: భార్యాభర్తలపై టెక్కీల దాడి

Hyderabad
హైదరాబాద్/వరంగల్: నగరంలోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. హోటల్‌లో ఉన్నఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున ఎల్‌బినగర్‌లోని ఓ హోటల్‌పై పోలీసులు దాడి చేశారు.

హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 2013 డిసెంబర్‌లోనూ ఈ హోటల్‌లో వ్యభిచారం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో నిర్వాహకుడితోపాటు ఇద్దరు విటులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

మద్యం మత్తులో భార్యాభర్తలపై టెక్కీల దాడి

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో రహదారిపై బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలపై మద్యం మత్తులో కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైటెక్ సిటీ సమీపంలో చోటు చేసుకుంది. తమకు అడ్డువచ్చారన్న ఆగ్రహంతోనే వారిపై టెక్కీలు దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. దాడిలో భార్యాభర్తలకు తల భాగంలో గాయాలయ్యాయి.

యువతి ఆత్మహత్య

వరంగల్: జిల్లాలోని చిట్యాలలోని రామ్‌నగర్‌లో ఓ యువతి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని ఆమె బంధవులు వరంగల్‌లోని ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. అత్యాచారం జరిగిందనే మనస్తాపంతోనే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. నిందితునిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వే బ్రిడ్జి వద్ద ఉన్న గోతిలో ప్రమాదవశాత్తు బైకుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు పడిపోయారు. తీవ్ర గాయాలు కావడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో కడప జిల్లా సిద్ధవటం మండలం మంగనవాండ్లపల్లెలో భూతగాదాతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+