కొడాలి నాని మెడకు ఉచ్చు - అనూహ్య ట్విస్ట్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పైన వరుస కేసులు నమోదు అవుతున్నాయి. విచారణ కొనసాగుతోంది. పలువురు ముఖ్య నేతల పైన గురి పెట్టారు. సోషల్ మీడియా కేసుల తరువాత ఈ నేతల అరెస్ట్ ల పైన పోలీసులు ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. గుడివాడలో వరుస ఫిర్యాదులతో మాజీ మంత్రి కొడాలి నానికి ఉచ్చు బిగుస్తోంది. అదే సమయంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
కొడాలి నాని ఎక్కడ
మాజీ మంత్రి కొడాలి నాని పై వరుస కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ నేతల ను లక్ష్యంగా చేసుకొని కొడాలి నాని తరచూ తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. దీంతో, కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత కొడాలి నానిని పైన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు చేసారు. టీడీపీ కేడర్ నుంచి కొడాలి నాని అరెస్ట్ కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో గుడివాడలో జగనన్న కాలనీల్లో అక్రమాలు జరిగాయంటూ తాజాగా మరో కేసు నమెదు అయింది. ఈ కేసులో విచారణ వేగవంతం అయింది.

వరుస ఫిర్యాదులతో
గుడివాడలో జగనన్న కాలనీల కోసం 173 ఎకరాల భూమి సేకరించారు. మెరక పేరుతో అనుచ రులకు వర్క్ ఆర్డర్స్ ఇచ్చారని నాని మీద ఆరోపణలు ఉన్నాయి. అలా తనకు కావాల్సిన వాళ్లకు పనులు అప్పగించి 8కోట్ల రూపాయలతో పనులు చేపట్టి.. 40 కోట్ల దాకా స్వాహా చేసినట్లుగా కొడాలి నాని పైన ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే ఈ వ్యవహారం పైన విజిలెన్స్ విచారణ చేసింది. ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. జగనన్న కాలనీల కోసం గుడివాడ నియోజకవర్గం మల్లాయ పాలెంలో 178.3 ఎకరాలు సేకరించారు. ఎకరా రూ.52 లక్షలు పెట్టి కొన్నారని తెలుస్తోంది. అక్కడ చదును చేయటం కోసం మెరక వర్క్ ఆర్డర్లు పొందిన వారంతా కొడాలి నాని అనుచరు లనే ఫిర్యాదులు ఉన్నాయి.
నాని మెడకు ఉచ్చు
నాని బినామీలే పనులు చేయించారనే ఆరోపణలతో విచారణ కొనసాగు తోంది. ఈ నివేదిక ఆధా రంగా కొడాలి నాని పైన చర్యలకు దిగే అవకాశం ఉంది. టీడీపీ పైన వైసీపీ హాయంలో విరుచుకు పడిన కొడాలి నాని..వల్లభనేని వంశీ ఇద్దరూ మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. పార్టీ వ్యవహారాల్లోనూ పాల్గొనటం లేదు. కేసులు వెంటాడుతున్న సమయంలోనే ఇద్దరు నేతలు సైలెంట్ అయ్యారనే అభిప్రాయం ఉంది. అయితే, పూర్తి ఆధారాలతోనే కొడాలి నాని విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వంలోని ముఖ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, నాని విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది ఉత్కంఠగా మారుతోంది.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications