రోడ్డుపై పోలీసుల బైఠాయింపు- కాలినడకన చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆయన కాన్వాయ్ కు అడ్డుగా రోడ్డుపై బైఠాయించారు. దీనితో ఆయన కాలినడకన అనపర్తికి వెళ్లారు.

కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు.. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఇవ్వాళ ఆయన అనపర్తికి వెళ్లారు. జీఓ నంబర్ 1 అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 రోడ్డుపై బైఠాయింపు..

రోడ్డుపై బైఠాయింపు..

ఈ సాయంత్రం చంద్రబాబు తన కాన్వాయ్ లో అనపర్తికి బయలుదేరి వెళ్లారు. 7 గంటలకు అనపర్తి దేవీ చౌక్ వద్ద బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించాల్సి ఉంది. దీనికోసం ఆయన జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. అనపర్తిలో రోడ్ షో, బహిరంగ సభను నిర్వహించడానికి పోలీసులు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. జీఓ నంబర్ 1 అమలులో ఉండటం, గతంలో కందుకూరు, గుంటూరుల్లో చంద్రబాబు సభల్లో సంభవించిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం పాలైన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

 వెళ్లాల్సిందేనంటూ..

వెళ్లాల్సిందేనంటూ..

పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ- చంద్రబాబు మాత్రం దేవీ చౌక్ నుంచి మరో చోటికి తన బహిరంగ సభను నిర్వహించుకోవడానికి అంగీకరించలేదు. దేవీ చౌక్ లోనే సభను నిర్వహిస్తానంటూ పట్టుబట్టారు. పోలీసులు ఎలా అడ్డుపడతారో చూస్తానంటూ హెచ్చరించారు. అనపర్తి సుమారు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అయినప్పటికీ చంద్రబాబు తన కాన్వాయ్ ను ముందుకు కదిలించడానికి ప్రయత్నించారు.

రోడ్డుపై బైఠాయింపు..

రోడ్డుపై బైఠాయింపు..

ఈ సమయంలో పోలీసులు ఆయనను నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. జీఓ నంబర్ 1 అమలులో ఉందని వివరించారు. గతంలో కందుకూరు, గుంటూరు సభల్లో చోటు చేసుకున్న ప్రాణనష్టం గురించి చంద్రబాబుకు వివరించే ప్రయత్నం చేశారు. దీనికి ఆయన ఏ మాత్రం వినిపించుకోలేదు. పోలీసుల విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దీనితో గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులు రోడ్డుపైనే బైఠాయించారు. ఆయన కాన్వాయ్ ను ముందుకు కదలనివ్వలేదు.

కాలి నడకన..

కాలి నడకన..

కాన్వయ్ ముందుకు కదిలే పరిస్థితి లేకపోవడంతో చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాలినడకన అనపర్తికి బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట హోం శాఖ మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహా కాకినాడ జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు. పోలీసులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నినాదాలు చేశారు.

దేవీ చౌక్ వద్ద

దేవీ చౌక్ వద్ద

అనపర్తి దేవీ చౌక్ వద్ద కూడా పోలీసులు బ్యారికేడ్లను అమర్చారు. చంద్రబాబు సహా.. టీడీపీ నాయకులెవరూ దేవీ చౌక్ వద్దకు చేరుకోకుండా ఉండటానికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వాటిని లెక్కచేయలేదు టీడీపీ నాయకులు. బ్యారికేడ్లను తోసుకుని చంద్రబాబు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అదే సమయంలో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. దీనితో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+