ఎన్నో కేసులు ఛేదించిన తెలంగాణా పోలీస్ జాగిలం లవ్లీ మృతి.. పోలీస్ లాంఛనాలతో లవ్లీ అంత్యక్రియలు
తెలంగాణ పోలీస్ శాఖలో మెరుగైన సేవలు అందించిన పోలీస్ జాగిలం లవ్లీ మృతి పోలీస్ శాఖలోని వారిని కలచివేసింది. లవ్లీ మృతితో వనపర్తి లో పోలీస్ సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 2013 సంవత్సరం నుంచి పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న లవ్లీ అనే పోలీస్ జాగిలం శుక్రవారం తుది శ్వాస విడిచింది. 13 ఏళ్ల కనైన్ లవ్లీ పోలీస్ శాఖలో అనేక క్లిష్టమైన కేసులను ఛేదించడంలో కీలక భూమిక పోషించింది. ఈ క్రమంలో లవ్లీ మృతితో పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకోగా శుక్రవారంనాడు వనపర్తి పోలీసులు పోలీస్ లాంఛనాల మధ్య లవ్లీ అంత్యక్రియలు నిర్వహించారు.

డీజీపీకి పుష్పగుచ్ఛాలు అందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన పోలీస్ జాగిలం లవ్లీ
పోలీస్ జాగిలం లవ్లీ 2015లో డీజీపీకి పుష్పగుచ్ఛాలు అందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గత తొమ్మిది సంవత్సరాలుగా పోలీస్ శాఖలో లవ్లీ అందించిన సేవలు నిరుపమానమైనవని సిబ్బంది గుర్తుచేసుకుంటున్నారు. లవ్లీ అనేక విశిష్ట సేవా పతకాలను కూడా గెలుచుకుంది. లవ్లీ అనే ఈ పోలీసు జాగిలం 2012లో పోలీస్ ఫోర్స్ లో చేరింది .2013లో ప్రాథమిక కోర్సును పూర్తి చేసింది. పోలీసు జాగిలాలకు ఇచ్చే ప్రాథమిక కోర్సు కోసం శిక్షణ సమయంలో, లవ్లీ రెండవ స్థానంలో నిలిచింది.

పలు కేసులను చేదించిన, రాష్ట్రస్థాయి గోల్డ్ మెడల్, చాంపియన్ షిప్ గెలుచుకున్న లవ్లీ
2019 లో నిర్వహించిన పోటీలలో లవ్లీ రాష్ట్రస్థాయి బంగారు పతకాన్ని గెలుచుకుంది. బెంగళూరులో జరిగిన 2015- 2016 ఆలిండియా డ్యూటీ మీట్ లో లవ్లీ ఛాంపియన్ షిప్ ను గెలుచుకుంది. వనపర్తి జిల్లాకు డిప్యూటేషన్ చేసిన నేపథ్యంలో లవ్లీ పలు హత్య కేసులను గుర్తించడంలో కీలకపాత్ర పోషించింది. 2018లో వనపర్తి పట్టణంలో సంచలనం సృష్టించిన చోరీ కేసులో నిందితులను పట్టుకోవడంలో లవ్లీ కీలక పాత్ర పోషించింది.

కిడ్నీ వ్యాధితో బాధపడుతూ లవ్లీ మృతి
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లవ్లీ ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదారాబాద్ లోని వెటర్నరీ ఆస్పత్రిలో లవ్లీకి చికిత్స అందించారు. అయినా దాని పరిస్థితి మెరుగుపడలేదు. ఆ తర్వాత మళ్ళీ వనపర్తి పశువైద్య శాలకు తరలించి చికిత్స అందించారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న లవ్లీ పరిస్థితి విషమించడంతో లవ్లీని వనపర్తిలోని ప్రభుత్వ పశువైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ లవ్లీ తుది శ్వాస విడిచింది.
Recommended Video

లవ్లీ మృతి పట్ల వనపర్తి ఎస్పీ దిగ్భ్రాంతి , పోలీస్ లాంఛనాలతో అంత్య క్రియలు
లవ్లీ మృతి పట్ల వనపర్తి పోలీస్ సూపరింటెండెంట్ కె.అపూర్వరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లవ్లీ మృతదేహానికి నివాళులర్పించారు. పోలీసు గౌరవాలతో లవ్లీ అంత్యక్రియలు జరిపారు. అనేక క్రైమ్ కేసులు ఛేదించడంలో లవ్లీ తమకు ఎంతో సహాయం చేసిందని, లవ్లీ మృతితో తాము తీవ్ర మనస్తాపం చెందామని వనపర్తి పోలీస్ సూపరింటెండెంట్ అపూర్వ రావు వెల్లడించారు. ఇక తొమ్మిదేళ్లపాటు లవ్లీ బాగోగులు చూసుకున్న ఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసులు లవ్లీ మృతితో కన్నీరు పెట్టుకున్నారు. ఇక లవ్లీ అంత్యక్రియలను తిరుమలయ్య కొండల అటవీ ప్రాంతంలో పోలీసు లాంఛనాలతో నిర్వహించనున్నట్టు పోలీసులు చెబుతున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications