జగన్ యాత్ర, ప్రత్యేక కెమెరాలతో పోలీసుల వీడియో: మహిళల కోసం సెక్యూరిటీని దాటి మరీ
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై పోలీసులు నిఘా పెట్టారు.
Recommended Video

కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై పోలీసులు నిఘా పెట్టారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రత్యేక అధునాతన వీడియో కెమెరాలను తెప్పించి యాత్రను చిత్రీకరించారు.

జగన్ వస్తున్నారని మైకులో చెప్పారు కానీ
జగన్ పాదయాత్రకు వస్తున్నారని వేంపల్లె నాలుగు రోడ్ల కూడలిలో దుకాణాలు మూసివేయాలని పోలీసులు మైకు ద్వారా చెప్పినట్లు ప్రచారం సాగింది. దీంతో చాలా మంది తమ షాపులు తెరవలేదు. సాంకేతిక కారణాల వల్ల అలా చెప్పారని తేలింది. ఆ తర్వాత మళ్లీ షాపులు తెరుచుకున్నారు.

భారీగా తరలి వచ్చిన జనం, రద్దీ కారణంగా ఇతర నేతలతో
జగన్ పాదయాత్ర రెండో రోజు (మంగళవారం) వేంపల్లె మండల ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వేంపల్లె శివారు ప్రాంత పొలాల్లోని గుడారం నుంచి ఉదయం తొమ్మిది గంటల సమయంలో జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా నాలుగు రోడ్ల కూడలికి వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించే ప్రయత్నం చేశారు. అయితే జనం రద్దీ పెరగడం, తోపులాట చోటుచేసుకోవడంతో ఇతర నేతలతో కార్యక్రమాన్ని పూర్తి చేయించారు.

జగన్‌కు రక్తతిలకం దిద్దారు
అనంతరం వైసీపీ జెండాను జగన్ ఆవిష్కరించారు. అక్కడే వైసీపీ కన్వీనర్ వేణు జగన్‌కు రక్తతిలకం దిద్దారు. అక్కడి నుంచి నేరుగా వేంపల్లె దళితవాడ వద్ద ఉన్న కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా తంగేడుపల్లె సర్కిల్ సమీపంలోని గుడారానికి వెళ్లారు.

అల్పాహారం, అక్కడ బస చేశారు
సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఆయన అల్పాహారం తీసుకొని మళ్లీ 5.45 గంటలకు యాత్ర ప్రారంభించి రాత్రి 8.30 గంటలకు వీరపునాయునిపల్లె మండలం నేలతిమ్మాయపల్లెకు చేరుకొని అక్కడే బస చేశారు.

సెక్యూరిటీని దాటుకొని వచ్చిన జగన్
భారీగా జనం తరలిరావడం, ప్రత్యేకించి మహిళలు జగన్‌కు వీరతిలకాలు దిద్ది దిష్టితీసేందుకు పోటీలు పడ్డారు. పలువురు మహిళలు ఇళ్లపైకి ఎక్కి పూలవర్షం కురిపించారు. పాదయాత్ర సందర్భంగా సినీనటుడు విజయచందర్ డప్పుల వాయిద్యానికి చిందులేశారు. సెక్యూరిటీని దాటుకొని మరీ తనను చూసేందుకు వచ్చిన మహిళలను జగన్ పలకరించారు.












Click it and Unblock the Notifications