జగన్ పై దాడి వెనుక - కీలక ఆధారాలు, వారి పనే..!!
ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ పై దాడి కలకలం రేపుతోంది. విజయవడ నగరంలో సీఎం జగన్ బస్సు యాత్ర పైన దాడి జరిగింది. ఆగంతుకులు ఆయనపై రాయి విసిరారు. గుర్తుతెలియని వ్యక్తి పూలతో పాటు రాయిని విసిరాడు. దీంతో ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. దీంతో వైద్యులు బస్సులోనే చికిత్స అందించారు. అయితే, ఈ ఘటన పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రాధమిక ఆధారాలు సేకరించారు. కొందరి పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
జగన్ పై దాడితో
ముఖ్యమంత్రి జగన్ పైన దాడి వ్యవహారం పైన ప్రధానితో సహా బెంగాల్ సీఎం మమత, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. విజయవాడలో బస్సు యాత్ర సమయంలో గుర్తు తెలియని వ్యక్తి క్యాట్ బాల్ ద్వారా రాయితో దాడి చేసినట్లు ప్రాధమికంగా నిర్దారణకు వచ్చారు. జగన్ పైన దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసు ఉన్నతాధికారులు..సిటీ పోలీసు కమిషనర్ పరిశీలించారు. సింగ్ నగర్ ప్రాంతంలోని వివేకానంద స్కూల్ నుంచి ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. పాఠశాల భవనంలోని ఒక కిటికి నుంచి ఈ దాడి జరిగినట్లు ప్రాధమికంగా గుర్తించారు. స్కూల్ భవనంలోని సీసీ కెమేరాలను పోలీసు అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఎవరెవరు ఈ భవనంలోకి వచ్చారనేది ఆరా తీస్తున్నారు.

స్కూల్ నుంచే దాడి..!
విజయవాడ నగరంలోని 59వ డివిజన్ గా పేర్కొనే ఈ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. స్కూల్ భవనం పై నుంచే దాడి జరిగిందని భావిస్తున్న పోలీసులు..అక్కడ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. పాఠశాల మెట్లు, కారిడార్,ప్రవేశం లోని సీసీ కెమేరాల ఫుటేజ్ ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. జగన్ పైన గురి చూసి కొట్టటం ఉద్దేశ పూర్వకంగా జరిగినదేనని నిర్ధారణకు వచ్చారు. జగన్ తో పాటుగా విజయవాడ సెంట్రల్ వైసీపీ అభ్యర్ది వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి గాయం అయింది. జగన్, వెల్లంపల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేసారు. అయితే, దాడి చేసింది రాయి..పిల్లెట్ తో దాడి చేసారా అనేది నిర్దారణ జరగాల్సి ఉంది. జగన్ కోలుకోవాలని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు మమతా, స్టాలిన్ ఆకాంక్షించారు.

పోలీసుల విచారణ
జగన్ పై దాడిని పలువురు ప్రముఖులు ఖండించారు. దాడి జరిగిన వెంటనే వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ పచ్చమూకలు చేసిన పిరికిపంద చర్యగా వైసీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని పార్టీ పిలుపునిచ్చింది. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇటు ఎన్నికల సంఘం ఈ ఘటన పైన నివేదిక ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయం పైన త్వరలోనే విచారణలో అన్ని విషయాలు నిర్ధారణకు వస్తాయని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications