దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి, లిక్కర్ సేల్స్ లో లీడర్స్ బిజీ, బూమ్ బూమ్

ఆంధ్రప్రదేశ్ లో ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యం భారీ ఎత్తున విక్రయిస్తున్నారని మరోసారి వెలుగు చూసింది. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. అయితే ఇంతలోపు అక్రమంగా ఇతర రాష్ట్రాల మద్యం విక్రయించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలని కొంతమంది పక్కాప్లాన్ చేస్తూ అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారు.

ఇలా ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం తీసుకోవచ్చి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త మద్యం విధానం అమలులోకి వచ్చిన విషయం తెలిసింది. ఆ సందర్భంలో బూమ్ బూమ్ బీర్లతో పాటు చిత్రవిచిత్రమైన లిక్కర్ బ్రాండ్లు ప్రజలకు పరిచయం చేసిన వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యం విక్రయించి భారీ మొత్తంలో వ్యాపారం చేసిన విషయం తెలిసిందే.

Police have seized Karnataka Liquor being sold in Andhra Pradesh

గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో వంద రూపాయలకే రెండు క్వాటర్లు వచ్చే చీఫ్ లిక్కర్ వచ్చే మద్యం గత వైసీపీ ప్రభుత్వంలో ఒక క్వాటర్ లిక్కర్ బాటిల్ రూ. 200కు పైగా విక్రయించారు. ఇలా భారీ మొత్తంలో నాసిరకం మద్యం కొనుగోలు చేయలేక సామాన్య ప్రజలు ఇతర రాష్ట్రాల లిక్కర్ కు, నాటు సారాకు అలవాటు పడ్డారు. ప్రజల వీక్నెస్ ని పెట్టుబడి చేస్తున్న కొంతమంది నాయకులు ఇతర రాష్ట్రాల నుండి భారీ మొత్తంలో అక్రమంగా మద్యం ఆంధ్రప్రదేశ్ కు తరలించి విక్రయించారు.

కర్ణాటక మంచి ఎక్కువగా చీప్ లిక్కర్ ఆంధ్రప్రదేశ్ లో విక్రయించారు. కర్ణాటక సరిహద్దు జిల్లాలు అయిన చిత్తూరు, అనంతపురం, అన్నమయ్య, సత్య సాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలలో కర్ణాటక నుండి విపరీతంగా మద్యం తీసుకు వచ్చి విక్రయించారని ఇప్పటికే పలు కేసులు కూడా నమోదైనాయి. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటిపోయినా కర్ణాటక నుండి అక్రమ మద్యం తీసుకువచ్చి విక్రయించే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.

కర్నూలు జిల్లాలోని కోడుమూరులో అక్రమంగా మధ్యం తరలించి విక్రయిస్తున్న నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బైకులు, బొలెరో వాహనాలు, జీపుల్లో కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడుమూరు మండలం లోని కృష్ణాపురం గ్రామం సమీపంలో మఫ్టీలో మకాం వేసిన పోలీసులు లక్షలాది రూపాయల విలువైన కర్ణాటక మధ్యం స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించి శివ శంకర్ గౌడ్, మోహన్ గౌడ్, కృష్ణా, యుగంధర్ గౌడ్ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. రెండు మూడు సంవత్సరాల నుండి నిందితులు బొలేరో వాహనాలు, జీపులు, ద్విచక్ర వాహనాల్లో కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తీసుకువచ్చి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయిస్తున్నారని, కొంత మంది నిందులు పారిపోవడంతో వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+