కోవిడ్ బాధితులకు టీడీపీ భరోసా-నేతల హౌస్ అరెస్టులు-చంద్రబాబు ఫైర్
ఏపీలో కోవిడ్ బాధితులకు భరోసా పేరుతో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులను సందర్శించేందుకు సిద్దమైన టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టులు చేశారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, దెందులూరులో చింతమనేని ప్రభాకర్.. తెదేపా నేతలు గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ, రాజమహేంద్రవరంలో తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడప జిల్లా సింహాద్రిపురంలో తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
Recommended Video
టీడీపీ నేతల హౌస్ అరెస్టులను అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ గడప దాటి బయటకు రావడం లేదని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కుల్ని హరించే విధంగా సీఎం జగన్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతులు ఉండకూడదన్న విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కరోనా రోగులకు ధైర్యం చెప్పి ఆసుపత్రుల్లో ప్రజలకు అందుకున్న చికిత్స, సౌకర్యాలను పరిశీలించేందుకు టీడీపీ నాయకులు వెళ్తే ప్రభుత్వనికి వచ్చిన నష్టమేంటి? రాష్ట్రంలో సరైన వైద్యం అందక ప్రజలు చనిపోతున్నా.. ముఖ్యమంత్రి గడప దాటి బయటకు రాడు, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ నేతలు వెళ్తుంటే మాత్రం అరెస్ట్ చేస్తారా? ముఖ్యమంత్రి ఆసుపత్రులను ఎందుకు సందర్శించడం లేదు? ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఏడాదిగా కరోనా విలయ తాండవం
చేస్తున్నా ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడానికి చేసింది శూన్యమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవని చంద్రబాబు గుర్తుచేశారు. 45 ఏళ్ళు నిండిన వారికి ఇంకా పూర్తి స్థాయిలో వ్యాక్షిన్ ఇవ్వలేదన్నారు. నిరుపేద రోగుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రవేట్ ఆసుపత్రులపై నియంత్రణ చర్యలు లేవని, స్మశానాల్లో కూడా టోకెన్లు తీసుకునే దుస్థితి ప్రజలకు వచ్చిందన్నారు.కరోనా నివారణలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈడినట్టేనని ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. అందుకే కరోనా రోగులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు వైద్యం కోసం ఇతర రాష్టాలకు వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఈ విదంగా ఉంటే జగన్ మాత్రం ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, హౌస్ అరెస్ట్ లతో ఆనందం పొందుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications