Duvvada, Divvela: దువ్వాడ, దివ్వెల మాధురికి షాకిచ్చిన పోలీసులు..!
ప్రేమకు వయస్సుతో సంబంధం లేదు.. ఏజ్ అనే కేవలం నంబర్ మాత్రమేనని నిరూపించారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. పెళ్లికి ఎదిగిన పిల్లలున్నా.. బడికి పంపే బిడ్డ ఉన్నా ప్రేమకు అడ్డు కాదని చెబుతున్నారు. న్యూస్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఫేమస్ అయిపోతున్నారు.దువ్వాడ శ్రీనివాస్ వయస్సు 58 సంవత్సరాలు.. ఆయనకు భార్య, పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. ఇక దివ్వెల మాధరి వయస్సు 35 ఏళ్ల కంటే తక్కువే.. ఆమెకు ఓ కూతురు ఉంది.
అయినా ప్రేమలో మునిగిపోతున్నారు. ఈ ఆదర్శ జంట కొద్ది రోజుల క్రితం తిరుమల వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్నారు కూడా. అయితే అక్కడ వారు రీల్స్ చేసినట్లు కేసు నమోదు అయింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చి ఫిర్యాదుతో బీఎన్ఎస్ 292, 296, 300 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు తిరుమల వచ్చిన సందర్భంగా హల్ చల్ చేశారు. తమ మధ్య ఉన్న సంబంధం ఏమిటో చెప్పారు. అందరికి చెప్పి మారి పెళ్లి చేసుకుంటామని దివ్వెల మాధురి చెప్పారు.

ఇరువురికి విడాకులు వచ్చాక పెళ్లి చేసుకుంటామని పేర్కొన్నారు. తిరుమలలో తాము రీల్స్ చేయలేదని.. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి చెబుతున్నారు. తమది పవిత్రమైన బంధమని మాధురి చెప్పారు. స్నేహితురాలిగా దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రోటోకాల్ ప్రకారమే తిరుమలకు వెళ్లినట్లు పేర్కొన్నారు.
మొన్నటి వరకూ తిరుమల లడ్డూపై ప్రచారం చేశారని.. ఇప్పుడేమో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌పై తాను చేసిన వ్యాఖ్యల వల్లే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. మీడియా వాళ్లను తాం పిలువలేదన్నారు. పవిత్రమైన స్థలంలో ఎంత పవిత్రంగా ఉండాలనేది తమకు తెలుసున్నారు.












Click it and Unblock the Notifications