బారికేడ్లు పెడితే నిషిత్ బతికేవాడు, వర్షం కురవకపోతే మరోలా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రోడ్డుపై బారికేడ్లు పెట్టి ఉంటే ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, అతని స్నేహితుడు రవివర్మ బతికి ఉండేవారు.అయితే ప్రతి రోజూ ఈ రోడ్డులో బారికేడ్లు పె్టేవారు.అయితే వర్షంపడి మెట్రో పనులు నిలిచిపోవడం వల్లే బారికేడ్లు ఏర్పాటు చేయలేదు.దీంతో నిషిత్ కారు ఆ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ప్రమాదానికి గురైంది.

ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, ఆయన స్నేహితుడు రవివర్మలు రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రముఖుల ఇళ్ళలో రోడ్డు ప్రమాదాలు విషాదాన్ని నింపాయి.

అయితే నిషిత్ ప్రయాణించిన కారు అత్యాధునికమైంది. ఎంత పెద్ద ప్రమాదం జరిగిన కారులో ప్రయాణించేవారికి ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా సేప్టీ మేజర్స్ ఈ కారులో ఉన్నాయి. కానీ, ఇవేవీ కూడ నిషిత్ ను ఆయన స్నేహితుడు రవివర్మను కాపాడలేకపోయాయి.

అయితే నిషిత్ నడుపుతున్న కారులో లోపాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఎందుకు ఈ కారులో ప్రయాణిస్తున్న వారు కారును ఆపేందుకు ప్రయత్నించినా కాని, కారు ఆగలేదు.అయితే దీనికి కారణాలేమిటో పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

బారికేడ్లు పెట్టి ఉంటే నిషిత్ ప్రాణాలతో బతికేవాడు

బారికేడ్లు పెట్టి ఉంటే నిషిత్ ప్రాణాలతో బతికేవాడు


ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ ఆయన స్నేహితుడు రవివర్మలు జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36 లో 9వ, మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది.దీంతో నిషిత్, రవివర్మలు అక్కడికక్కడే మరణించారు.జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో మెట్రో పనులు జరుగుతున్నాయి. రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ రోడ్డును బారికేడ్లలో మూసివేసి పనులు నిర్వహిస్తున్నారు.

మంగళవారం రాత్రి నగరంలో భారీ వర్షం కురిసింది.అయితే దీంతో మెట్రో పనులు నిలిపివేశారు.బారికేడ్లు పెట్టకపోవడం వల్లే నిషిత్ ఆ రోడ్డులోకి వెళ్ళినట్టు తెలుస్తోంది.అవి అడ్డుగా పెట్టి ఉంటే ప్రత్యామ్నాయదారిలో వాహనాన్ని మళ్ళించేవారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రత్యామ్నాయదారిలో వాహనం వెళ్తే ప్రమాదం నుండి నిషిత్, రవివర్మలు బయటపడేవారు. ప్రమాదసమయంలో నిషిత్ నిద్రమత్తులో ఉండి ఉండవచ్చన్న అనుమానాలు కూడ అనుమానాలు వ్యక్తమౌతాయి.

 బ్రేకులు పడలేదా?

బ్రేకులు పడలేదా?

నిషిత్ నడిపిన కారుకు బ్రేక్ లు పడలేదని తెలుస్తోంది. ఎంత స్పీడున్నా ఈ కారు బ్రేక్ వేయగానే సెకన్లలోనే ఆగిపోతోంది.అయితే ప్రమాదానికి ముందు కారు బ్రేక్ లు వేసేందుకు ప్రయత్నించినా బ్రేకులు పడనట్టుగా సీసీ టీవి పుటేజ్ లో కన్పిస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 కెబిఆర్ పార్క్ వద్ద నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా రోడ్ నెంబర్ 36 లో నిషిత్ కారు ప్రవేశించింది.చెక్ పోస్టు వద్ద ఓ వాహనం అడ్డురావడంతో నిషిత్ బ్రేక్ వేశారని సమాచారం. అయితే జూబ్లిహిల్స్ రోడ్ నెంబర్ 36లోకి ప్రవేశించే సమయంలో ఆ ప్రాంతమంతా ఎత్తుగా ఉండడంతో స్పీడ్ ను పెంచి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.

కారులో సాంకేతిక లోపాలున్నాయా?

కారులో సాంకేతిక లోపాలున్నాయా?

నిషిత్ నడిపిన మెర్సిడెజ్ బెంజ్ కారులో అత్యాధునికమైంది. ఎలాంటి ప్రమాదం జరిగినా కారులో ప్రయాణిస్తున్నవారు ఆ ప్రమాదం నుండి బయటపడేలా సౌకర్యాలను కల్పించారు. చిన్న ప్రమాదం జరిగినా కారులోని 8 బెలూన్లు తెరుచుకొనే వెసులుబాటు ఈ కారులో ఉన్నాయి. అయితే వాహనం బ్రేకింగ్ సిస్టమ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అమర్చినట్టు మెకానిక్ లు చెబుతున్నారు. వాహనం ఎంత స్పీడులో ఉన్నా బ్రేక్ వేయగానే సెకన్లలో ఆగిపోతోందని బెంజ్ నిపుణులు చెబుతున్నారు.

రోడ్డు డిజైన్లలో లోపాలున్నాయా?

రోడ్డు డిజైన్లలో లోపాలున్నాయా?

మెట్రో పనులు జరుగుతున్న పెద్దమ్మ దేవాలయం రోడ్డు డిజైన్ పై గతంలో అనేక విమర్శలొచ్చాయి. స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో పాటు మలుపులు అధికంగా ఉండడంతో మెట్రో పనులు మొదలుకాకముందే నిత్యం అనేక ప్రమాదాలు జరిగేవి. నిషిత్ కారు ప్రమాదం జరిగిన ప్రాంతం కూడ అనేక ప్రమాదాలు జరగడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.ఈ మలుపుల వద్ద ప్రయాణీస్తున్న డ్రైవర్లు రోడ్డును అంచనావేయలేక డివైడర్లను ఢీకొట్టి మరోవైపు ఉన్న రోడ్డుపై బోల్తాపడిన సంఘటనలు కూడ ఉన్నాయి.మెట్రో పనులు మొదలయ్యాక ట్రాఫిక్ మళ్ళింపుతో కొంతవరకు ప్రమాదాలు తగ్గాయి.నిషిత్ కూడ రోడ్డును అంచనావేయడం వల్ల వైఫల్యం చెంది ఉంటారని నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు.

బోర్డులు పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది

బోర్డులు పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది


జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, 48 , 1, 2, 12 తదితర దారుల్లో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. అయితే ఇక్కడ జరిగే రోడ్ల డిజైన్ లోపం కారణంగా ప్రతి నెలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Police officers Searching for the reason Nisith's road accident.clues team visited accident spot on Thursday.
Please Wait while comments are loading...