RRR: వయసు అయిపోయింది, మరిచిపోయా, టైనింగ్ బాగుంది
ప్రముఖ పారిశ్రామికవేత్త, నరసాపురం వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు పెట్టిన కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఐడీ రిటైడ్ అధికారి విజయ్ పాల్ గుంటూరు పశ్చిమ డీఎస్పీ కార్యాలయంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ సమయంలో సీఐడీ రిటైర్డ్ అధికారి విజయ్ పాల్ చెప్పిన సమాధానాలతో పోలీసు అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. నాకు వయసు అయిపోయిందని, రిటైడ్ కూడా అయిపోయాను అని విజయ్ పాల్ పోలీసులకు ప్రశ్నకు సమాధానం ఇచ్చారు,
ఆరోజు ఏం జరిగిందో నాకు గుర్తులేదని సమాధానం చెప్పడంతో పోలీసులు హడలిపోయారని సమాచారం. పోలీసుల విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో సీఐడీ రిటైడ్ అధికారి విజయ్ పాల్ మాత్రం విచారణకు సహకరించలేదని పోలీసు అధికారులు అంటున్నారు. నరసాపురం వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజును 2021 మే నెలలో రాజాద్రోహం కేసులో హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ కి ఎవరెవరు వెళ్లారని విచారణ అధికారులు విజయ్ పాల్ ను ప్రశ్నించారు.

అయితే ఇద్దరు ముగ్గురు ఎస్ఐల పేర్లు చెప్పిన విజయ్ పాల్ మిగిలిన వారి పేర్లు నాకు గుర్తు లేవని, ఈ సంఘటన జరిగి చాలా రోజులు అయ్యిందని పోలీసులకు చెప్పారు. హైదరాబాద్ లో రాఘురామ కృష్ణరాజును తర్వాత గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆరోజు రాత్రంతా తనను పోలీస్ స్టేషన్ లో కస్టడీలో పెట్టుకుని చిత్రహింసలు పెట్టారని, తనను హత్య చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ రఘురామ కృష్ణరాజు గుంటూరులోని నగరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సీఐడీ రిటైడ్ అధికారి విజయ్ పాల్ తో సహా కొందరు పోలీసు అధికారుల మీద రఘురామ కృష్ణరాజు కేసు పెట్టారు. ప్రస్తుతం ఉండి టీడీపీ ఎమ్మెల్యే అయిన రఘురామ కృష్ణరాజు పెట్టిన కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంలో విజయ్ పాల్ మాయం అయ్యారు. కేసు నమోదు అయిన తర్వాత హైకోర్టులో మీకు మెయిల్ ఇవ్వలేదని, ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్లారు అని కేసు విచారణ చేస్తున్న పోలీసులు విజయ్ పాల్ ను ప్రశ్నించారు.

తాను రాష్ట్రంలోనే ఉన్నానని, తాను ఎక్కడికి పారిపోలేదని, అవి నా వ్యక్తిగత విషయాలని విజయ్ పాల్ సమాధానం చెప్పారని గుంటూరు పోలీసులు అంటున్నారు. ఫోన్ ఎందుకు స్విచాఫ్ చేశారు అంటే తాను రిటైడ్ అయిపోయానని, తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ ఆన్ చేసుకుంటానని, అది నా వ్యక్తిగత విషయం అని మీకు పూర్తి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని విజయ్ పాల్ అంటున్నారని పోలీసులు చెప్పారు.
తనకు వయసు మీద పడిందని, జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని, ఏదైనా ఉంటే తాను కోర్టుకే చెబుతానని సీఐడీ రిటైడ్ అధికారి విజయ్ పాల్ చెప్పారని పోలీస్ అధికారులు అన్నారు. సుమారు మూడు గంటల పాటు విచారణ చేసిన తర్వాత మరోసారి మిమ్మల్ని పిలుస్తామని, అప్పుడు మీరు పూర్తి సమాధానాలు చెప్పాలని పోలీసు అధికారులు విజయ్ పాల్ కు సూచించారు. సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ ఆయన న్యాయవాదులతో కలిసి గుంటూరు డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మొత్తం మీద రఘురామ కృష్ణరాజు గారు కేసు వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతోనే విజయ్ పాల్ గుంటూరు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications