వంశీ బయటకు వచ్చేది అప్పుడేనా- బిగుస్తున్న ఉచ్చు..!!
వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదా. తాజా పరిణామాలు ఈ అనుమానాలకు కారణం అవుతున్నాయి. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న వంశీని పెండింగ్ కేసుల్లోనూ విచారణ దిశగా పోలీసులు సమాయత్తం అవుతున్నారు. పీటీ వారెంట్లు వేసి కస్టడీకి తీసుకునేందుకు సిద్ధమవుతు న్నారు. దీంతో, వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టం అవుతోంది. మరి.. వంశీ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటి. వైసీపీ ఏం చేయబోతోంది..
పాత కేసులు బయటకు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన పెండింగ్ కేసులను పోలీసులు బయటకు తీస్తున్నారు. తాజా గా ఎస్సీ-ఎస్టీ కేసులో రిమాండ్ లో ఉన్న వంశీ పైన పెండింగ్ కేసుల్లోనూ విచారణ దిశగా కసరత్తు కొనసాగుతోంది. పలు కేసులు ఉన్నా.. వంశీ వాటి విచారణకు నామ మాత్రంగానే హాజరైనట్లు అధికా రులు చెబుతున్నారు. ఆ కేసుల్లో ఇప్పుడు విచారణ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందు లో భాగంగా హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్‌లో గత ఏడాది నవంబరులో నమోదైన కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. ప్రాథమిక సహకారం సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాసరావు తన సొంత స్థలంలో నడుపుకుంటున్న ఎరువుల దుకాణాన్ని పోరంబోకు స్థలంగా చూపించి వంశీ కూల్చివేయించారు.

విచారణకు సిద్దం
ఈ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకొని విచారించేలా కసరత్తు జరుగుతోంది. గత ఏడాది ఎన్నికల సమయంలో తేలప్రోలులో ప్రస్తుత గన్నవరం ఎమ్మెల్యే, యార్లగడ్డ వెంకట్రా వుపై వంశీ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై ఉంగుటూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నోటీ సు అందుకున్నా ఇంత వరకు విచారణకు హాజరుకాలేదు. ఈ కేసు విషయంలో పీటీ వారెంటు వేయనున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఈనెల 20 వరకు సుప్రీం కోర్టులో ఉపశమనం లభించింది.
వరుస కేసుల్లో
ఆ తర్వాత సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ను రద్దు చేస్తే ఇందులోనూ విచారణ కోసం సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నార ని సమాచారం. రంగబాబు పై దాడి ఘటన కేసు హత్యాయత్నం కింద 307 సెక్షన్ చేర్చారు. దీని వెనుక వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ కేసులోనూ వంశీ ని విచారించేలా పోలీసులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా.. వరుస కేసులతో వంశీ ఇప్పట్లో బయటకు రావటం కష్టమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications