Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజోలు సీటును జనసేన నిలబెట్టుకోనుందా ? పొలిటికల్ క్రిటిక్ సర్వే లో షాకింగ్..

ఏపీలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన స్ధానాల్లో గెలిచిన ఏకైక సీటు అప్పటి తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మాత్రమే. ఇక్కడ జనసేన అభ్యర్ధిగా రాపాక వరప్రసాదరావు గెలుపొందారు. ఇది మినహా రాష్ట్రంలో పోటీ చేసిన అన్ని సీట్లను జనసేన కోల్పోయింది. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లోనూ ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత అక్కడ సీన్ మారిపోయింది.

2019 ఎన్నికల్లో రాజోలు నుంచి గెలిచిన ఏకైక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆనంతరం వైసీపీలోకి ఫిరాయించేశారు.జనసేనకు క్రమంగా దూరమవుతూ వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. చివరికి రాజోలు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధిగా ఖాయమైపోయారు. దీంతో గతంలో ఆయనపై పోటీ చేసి ఓటమిపాలైన వైసీపీ అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావు జనసేనలోకి ఫిరాయించారు. ఈసారి బొంతు రాజేశ్వరరావును అక్కడి నుంచి ఎలాగైనా గెలిపించుకోవాలని జనసేన పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో రాజోలు సీటులో ఎవరు గెలవబోతున్నారనే దానిపై పొలిటికల్ క్రిటిక్ సర్వే వెల్లడించింది.

political critic survey predicts janasena retain razole assembly seat, only winning seat in 2019

ప్రస్తుతం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న రాజోలు అసెంబ్లీ సీటులో ఈసారి ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న జనసేన పార్టీ గెలవబోతున్నట్లు పొలిటికల్ క్రిటిక్ సర్వే వెల్లడించింది. అలాగే ఈ నియోజకవర్గంలో వైసీపీ మళ్లీ ఓటమిపాలవుతున్నట్లు సర్వే రిపోర్టు చెబుతోంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన రాజోలులో కాపుల జనాభా కూడా ఎక్కువ ఉండటం ఈ ఫలితానికి కారణమవుతున్నట్లు అర్ధమవుతోంది. అలాగే ఈ సీటులో ఏ పార్టీ ఎంత ఓటు శాతం తెచ్చుకోబోతోందన్నదీ ఈ రిపోర్ట్ వెల్లడించింది.

పొలిటికల్ క్రిటిక్ సర్వే ప్రకారం రాజోలు సీటులో వైసీపీ, టీడీపీ, జనసేన మధ్య పోటీ జరగబోతోంది. ఈ మూడు పార్టీలు విడిగా పోటీ చేస్తాయని అనుకుంటే ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో ఈ సర్వే వెల్లడించింది. దీని ప్రకారం లక్షా 86 వేల ఓట్లున్న ఈ గ్రామీణ నియోజకవర్గంలో జనసేన 36.85 శాతం ఓట్లు తెచ్చుకుని విజయం సాధించే అవకాశం ఉంది. రెండో స్ధానంలో ఉన్న వైసీపీకి 32.99 శాతం ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. అలాగే టీడీపీకి 27.81 శాతం ఓట్లు రాబోతున్నట్లు సర్వే వెల్లడించింది. దీంతో రాజోలు సీటును జనసేన నిలబెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+