ఆ టీడీపీ ఎంపీపై పెరుగుతున్న అసంతృప్తి..ఇలా అయితే కష్టమే..!

ఎవరూ ఊహించని విధంగా 2024 ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూటమి పార్టీల అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేశారు.భారీ అంచనాల మధ్య అధికారంలో వచ్చిన కూటమి నేతలు మాత్రం, ప్రజల అంచనాలకు తగ్గట్టుగానే పని చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో పనులు కావడం లేదనే మాటలు తెరపైకి వస్తున్నాయి. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన కేశినాని నాని అంచనాలను మించి రాణించారు.

పార్టీలకు అతీతంగా ఆయన చేసిన పనులు కేశినాని నానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. సొంత నిధులు ఖర్చు పెట్టి మరీ ఆయన తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలకు పరిష్కారం చూపించారు. గత ఎన్నికల్లో కేశినాని నాని వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇదే సమయంలో కేశినాని నాని తమ్ముడు , కేశినేని శివనాథ్ (చిన్ని) తెర మీదకు రావడం, ఆయనకు టీడీపీలో ప్రాధాన్యత పెరగడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయి.

Political Disconnect Why Vijayawada MP Kesineni Chinni is Facing Public Backlash

2024 ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడమే కాకుండా భారీ మెజార్టీతో అన్నపై విజయంపై కూడా సాధించారు చిన్ని. అయితే గెలిచిన దగ్గర నుంచి కూడా కేశినేని శివనాథ్ (చిన్ని)పై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.2024 నుంచి ఎంపీగా కొనసాగుతున్న ఆయన, గతంలో ఎంపీలుగా పనిచేసిన వారిలా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రజలు ఆయన్ను కలవడానికి చాలా కష్టంగా ఉంటోందని, ఇది ఆయన ఎంపీగా మారిన తర్వాత వచ్చిన మార్పు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గత ఎంపీల మాదిరిగా అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చిన్ని దృష్టి పెట్టడం లేదని, ఆయన పాలన నిరాశాజనకంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఎంపీగా గెలిచి ఏడాది దాటినప్పటికీ ఆయన తన మార్క్ ఎక్కడా కూడా చూపించలేకపోయారనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

పాత తరం ఎంపీలు నిత్యం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేసేవారని, అదే తరహా పాలన చిన్ని నుంచి ఆశిస్తున్నారని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలను ఆలకించి, పరిష్కరించాల్సిన అవసరం ఉందని, లేకపోతే ప్రజల నుంచి విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే తన పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కూడా ఎంపీకి సరిగా పోసగడం లేదని తెలుస్తోంది. దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు చిన్నికి వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. ఏది ఏమైనప్పటికీ కేశినేని చిన్ని పనితీరు సరిగా లేదని నియోజకవర్గ ప్రజల మాట. దీనిపై ఆయన ఇప్పటికైనా దృష్టి సారిస్తే మరోసారి ఆయనదే విజయమని ప్రజలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+