టీ తాగిన విహెచ్, బండారు: అభ్యర్థుల ప్రచారం(పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ పార్టీలతోపాటు జై సమైక్యాంధ్ర పార్టీ ఎన్నికల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. బిజెపి సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి బండారు దత్తాత్రేయ తన ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వాడవాడలా, ఇంటికి తిరిగి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల తరపున కేంద్రమంత్రి జైరాం రమేష్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. అంబర్‌పేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి హనుమంతరావు, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపి అంజన్ కుమార్ యాదవ్ కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కూడా తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి కూడా వాడవాడలా తిరిగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఎల్‌బినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తన ప్రచార జోరును పెంచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య తన ప్రచారాన్ని వేగవంతం చేశారు., సిపిఐ పార్టీల నాయకులు కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి, మాజీ డిజిపి దినేష్ రెడ్డి కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు.

టీ తాగాను.. నీ ఓట నాకే
బిజెపి సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి బండారు దత్తాత్రేయ తన ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. ప్రచారంలో భాగంగా ఓ టీ స్టాల్‌లో ఛాయ్ తాగుతున్న బండారు దత్తాత్రేయ.

మీ ఓటుకు నా నమస్కారం
బిజెపి సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి బండారు దత్తాత్రేయ తన ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. వాడవాడలా, ఇంటికి తిరిగి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

జైరాం ప్రచారం..
కాంగ్రెస్ అభ్యర్థుల తరపున కేంద్రమంత్రి జైరాం రమేష్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు.

దినేష్ రెడ్డి ప్రచారం..
జై సమైక్యాంధ్ర పార్టీ మల్కాజ్‌గిరి అభ్యర్థి, మాజీ డిజిపి దినేష్ రెడ్డి కూడా నగరంలో విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు.

దత్తన్నకు చిన్నారి పూలమాల
బిజెపి సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి బండారు దత్తాత్రేయకు పూలమాల వేస్తున్న ఓ చిన్నారి.

అలిసిపోయా.. అందుకే టీ
అంబర్‌పేట అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి హనుమంతరావు కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తనకే ఓటు వేయాలని కోరుతున్నారు.

అంజన్‌కుమార్ యాదవ్, విహెచ్
అంబర్‌పేట నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విహెచ్, సికింద్రాబాద్ ఎంపి అంజన్‌కుమార్ యాదవ్.

దానం ప్రచారం..
ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కూడా తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.

తిలకం దిద్దిన మహిళ
ఖైరతాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కూడా తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. దానంకు తిలకం దిద్దుతున్న ఓ మహిళ.

కొబ్బరి నీళ్లు తాగుతూ..
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి వాడవాడలా తిరిగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఓటు అడుగుతూ..
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి వాడవాడలా తిరిగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్తిస్తున్నారు.

సుధీర్ రెడ్డికి మహిళల హారతి
ఎల్‌బినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

సుధీర్ రెడ్డి రోడ్‌షో
ఎల్‌బినగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు.

ఆర్ కృష్ణయ్య ప్రచారం..
ఎల్‌బి నగర్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య కూడా తన ప్రచారాన్ని వేగవంతం చేశారు.

సిపిఐ పాదయాత్ర
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఐ నాయకులు నగరంలో పాదయాత్ర నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

టిఆర్ఎస్ ప్రచారం
తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున ప్రచారం చేస్తున్న బంధువులు, కార్యకర్తలు.

శివాజీకి పూలమాల వేస్తూ...
తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ప్రచారంలో భాగంగా శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తున్న దృశ్యం.

రోడ్‌షో
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహించారు.












Click it and Unblock the Notifications