ఏపీలో మారిపోయిన సీన్..ఆ పార్టీకి అనుహ్యంగా పెరుగుతున్న మద్దతు

ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. 175కి 175 నియోజకవర్గాలు గెలవడమే లక్ష్యంగా సీఎెం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. జగన్‌ను గద్దె దించడమే ధ్యేయంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నారు.మూడు పార్టీలు ఒకటిగా ఏర్పడటంతో గెలుపు ఖాయమని కూటమి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పోలింగ్‌కు మరో ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతలందరూ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీల అధినేతలు కాలుకు బలపం కట్టుకుని మరీ రోజుకు మూడు , నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఇక ప్రధాన పార్టీలన్ని కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశాయి. వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలనే తిరిగి అమలు చేస్తామని చెప్పింది. అయితే గతంలో ఇచ్చిన వాటికి వ్యయాన్ని పెంచుతున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఇక ఉమ్మడి మ్యానిఫెస్టోకు జాతీయ పార్టీ అయిన బీజేపీ దూరంగా ఉండటం విశేషం. టీడీపీ,జనసేన పార్టీలు సూపర్ సిక్స్ పేరిట ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించాయి. ఇరు పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన తరువాత గ్రౌండ్ రిపోర్టు ఎలా ఉందనే దానిపై పలు నివేదికలు వెలువడ్డాయి.

Political Parties In Ap Target Women Voters

రాష్ట్రవ్యాప్తంగా ఓ ప్రముఖ సంస్థ ఇచ్చిన నేవేదిక ప్రకారం..రాష్ట్రంలో పురుషులు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని మహిళలు మాత్రం ఏకపక్షంగా వైసీపీ వైపు ఉన్నట్టు తేల్చింది.రాష్ట్రవ్యాప్తంగా 50.18 శాతం మంది పురుషులు టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారు. అదే వైసీపీ విషయానికి వచ్చేసరికి 46.5% మంది మద్దతు తెలిపారు. ఇక్కడ టీడీపీ కూటమికి మూడు శాతం మంది అదనంగా మద్దతు తెలపడం విశేషం.మరోవైపు మహిళలు 56.12% వైసీపీ వైపు మొగ్గుచూపగా.. టీడీపీ కూటమికి కేవలం 41.21% మంది మాత్రమే మద్దతు తెలిపారు.

టీడీపీ కంటే 15% మంది మహిళలు వైసీపీ వైపు మొగ్గు చూపడం విశేషం.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేశారు. దాదాపు అన్ని పథకాలను మహిళల పేరిటే మంజూరు చేశారు. దీంతో వారు సంక్షేమం పట్ల ఆకర్షితులు అయ్యారు. అందుకే వైసీపీకి బలమైన మద్దతుదారులుగా నిలిచారు. పురుషులతో పోల్చుకుంటే మహిళలకే సంక్షేమ పథకాలలో ఎక్కువగా వచ్చింది. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఆసరా.. ఇలా అన్ని పథకాలు వారి పేరుతోనే మంజూరు అవుతున్నాయి. సహజంగానే ఈ పథకాలను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే వారంతా వైసీపీకి తమ మద్దతు తెలుపుతున్నట్లు ఈ నివేదికలో తేలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+