కల్తీ నెయ్యిపై అక్కడే తాడోపేడో..! జగన్ కు సర్కార్ ప్రతిపాదన..!

ఏపీలో తిరుమల లడ్డూకు వాడిన నెయ్యి కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ తాజాగా రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎక్కడా లేకపోవడం, అదే సమయంలో రసాయనాలతో కల్తీ జరిగినట్లు నిర్ధారణకు రావడంతో రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కింది. తమ వాదనే కరెక్ట్ అంటూ టీడీపీ, వైసీపీ ఇద్దరూ చెప్పుకుంటున్న నేపథ్యంలో సర్కార్ (ap govt) కీలక నిర్ణయం తీసుకుంది.

కల్తీ నెయ్యిపై ప్రజల్ని తప్పుదోవ పట్టించారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర.. జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే దీనిపై చర్చించేందుకు 11వ తేదీన జరిగే అసెంబ్లీకి 11మంది సభ్యులతో రావాలని సూచించారు. కల్తీ జగన్మోహన్ రెడ్డి శ్రీవారి ప్రసాదాన్నీ కల్తీ చేసే అపవిత్ర కార్యానికి గత 5ఏళ్లలో తెరలేపారని ఆరోపించారు. జగనే ఒక కల్తీ, కల్తీ నాయకులతో గత 5ఏళ్లు కల్తీ ప్రభుత్వాన్ని నడిపిన భాగోతం అంతా నివేదికలు రూపంలో బయటకు వస్తోందన్నారు. దేవుడి పై నమ్మకం లేకే దోపిడీ కోసం నిబంధనలు సడలించారన్నారు. 4లక్షల ఆవుపాలు కావాలనే నిబంధన ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించారు.

Political Showdown AP Govt Offers Assembly Debate to YS Jagan on Ghee Adulteration Report

పాలే లేని నెయ్యి కోసం అనుకూలంగా నిబంధనలు సడలించింది దోపిడీ కోసమే అన్నారు. పాలే లేని డైయిరీలకు పెద్ద మొత్తంలో ఆర్డర్ లు ఇచ్చి హవాలా రూపంలో ముడుపులు అందుకున్నారన్నారు. జంతుకొవ్వు అవశేషాలు కూడా రసాయనాలతో నెయ్యి పేరిట తయారు చేసిన కల్తీ పదార్ధంలో వెలుగు చూశాయన్నారు. దేవుడితో ఆటలాడిన జగన్ అందుకు తగ్గ ఫలితం అనుభవించి తీరుతాడన్నారు.

Political Showdown AP Govt Offers Assembly Debate to YS Jagan on Ghee Adulteration Report

లడ్డూకు వాడిన నకిలీ పదార్ధాల్లో మోనో గ్లిజరైట్, మీటా క్యారటిన్, ఏసిడిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ రసాయనాలు వెలుగు చూశాయని మంత్రి తెలిపారు. మోనో గ్లిజరైట్ లో జంతు కొవ్వు లేదా వెజిటేబుల్ కొవ్వు ఉండవచ్చన్నది నిపుణుల అంచనా అన్నారు. తనకు దైవం మీద నమ్మకం లేదు కాబట్టి తిరుమలపై అపవిత్ర కుట్రలకు జగన్ తెరలేపాడన్నారు. కల్తీ జరిగింది వాస్తవమే కానీ భారీ కల్తీ జరగలేదన్నట్లుగా జగన్ వితoడ వాదం దైవం పై అతనికి నమ్మకం లేదనటానికి నిదర్శనం అన్నారు. పూర్తి నివేదిక వచ్చాక మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+