రెబల్‌స్టార్! అందరూ: టిపై చిరు, సీమాంధ్ర సిఎం: పొన్నం

కరీంనగర్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఆదివారం కరీంనగర్ జిల్లాలో తెలంగాణ అంశంపై స్పందించారు. తనకు అందరు కావాలని వ్యాఖ్యానించారు. ఆదివారం చిరు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఎలగందుల ఖిల్లా లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యలు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ... చిరంజీవి సీమాంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. తెలంగాణ బిల్లుకు చిరంజీవి పార్లమెంటులో మద్దతు పలికి సహకరించాలని కోరారు.

Ponnam appeals Chiranjeevi to support Telangana Bill

దీనిపై స్పందించిన చిరంజీవి... పొన్నంను రెబల్ స్టార్‌గా అభివర్ణించారు. చిరు మాట్లాడుతూ.. కేంద్రమంత్రిగా తనకు అన్ని ప్రాంతాలు, రాష్ట్రాలు కావాలని చెప్పారు. తమకు ప్రాంతాలు రాజకీయాలు వర్తించవని వ్యాఖ్యానించారు. తనకు ఇరు ప్రాంతాలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, అంతకుముందు చిరంజీవికి వేములవాడలో తెలంగాణ సెగ తగిలిన విషయం తెలిసిందే. చిరంజీవి సతీసమేతంగా కరీంనగర్ జిల్లా వేములవాడకు వచ్చారు. ఈ సమయంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) విద్యార్థులు చిరంజీవిని అడ్డుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా, చిరంజీవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిరంజీవి కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని చుట్టు ముట్టారు. ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వారి పైన లాఠీఛార్జ్ చేసి విద్యార్థులను చెదరగొట్టారు. చిరంజీవిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయనను తీసుకు వెళ్లారు.

పొన్నం గన్‌మెన్ తుపాకి గల్లంతు

పొన్నం ప్రభాకర్ గన్‌మెన్ తుపాకీ గల్లంతయింది. దీనిపై పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+