AP Liquor Shops: ఏపీలో మద్యం షాపుల టెండర్ల షాక్-అసలు కారణమిదే..?
ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఈ నెల 11న మద్యం షాపుల వేలాన్ని నిర్వహించబోతోంది. ఇందులో పాల్గొనేందుకు రిటైల్ లైసెన్స్ ల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే వీటికి పేలవ స్పందన వస్తుండటం అధికారులకు షాకిచ్చింది. దీని వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్దితి కొనసాగితే మరో మూడు రోజుల్లో గడువు ముగిశాక వేలం పరిస్దితి ఎలా ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో మద్యం షాపుల లైసెన్స్ ల కోసం తాజాగా దరఖాస్తుల్ని ఆహ్వానించారు. వీటికి ఆరంభంలో మంచి స్పందనే వచ్చింది. అయితే ఆ తర్వాతే సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది. ఆరు రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గానూ కేవలం 8,274 టెండర్లు దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర సగటు ప్రకారం చూసుకుంటే ఒక్కో మద్యం షాపునకు దాదాపు మూడు టెండర్లు వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ చెబుతోంది. అయితే ఈ పరిస్ధితి వెనుక కీలక కారణాలు కనిపిస్తున్నాయి.

మద్యం టెండర్ల కోసం అప్లికేషన్ల దాఖలులోనూ ఆశావహులు సిండికేట్లుగా మారినట్లు తెలుస్తోంది. దీంతో తమకు పోటీ రాకుండా ఇతరుల్ని నియంత్రిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అందుకే ప్రభుత్వం ఆశించిన దాని కంటే తక్కువగా దరఖాస్తులు దాఖలవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నా 10 వేలు కూడా దాటకపోవడం అధికారులకు షాక్ గా మారింది.
ఇప్పటివరకూ మద్యం షాపుల కోసం దాఖలైన టెండర్లలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855, - అత్యల్యంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లు ఉన్నాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో మద్యం టెండర్లల్లో సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది.తిరుపతి జిల్లాలో 227 షాపులకు కేవలం 165 టెండర్లే వచ్చాయి. అలాగే నెల్లూరు జిల్లాలో 182 షాపులకు 179 టెండర్లు మాత్రమే వచ్చాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకు బిడ్డర్లు ముందుకు రావడం లేదు.
ఎన్టీఆర్, విజయనగరం జిల్లాల్లో ఒక్కో మద్యం షాపునకు సగటున 5-6 టెండర్లు దాఖలు కాగా.. ఏలూరు జిల్లాలో 4-5 టెండర్లు దాఖలు అయినట్లు తెలుస్తోంది. పెరిగిన రేట్లు, సిండికేట్ల ప్రభావం, రాజకీయ జోక్యమే టెండర్లకు పేలవ స్పందన రావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications