రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతు వారికే??
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. భారతీయ జనతాపార్టీ సారధ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ప్రతిపక్షాలన్నీ కలిసి కాంగ్రెస్ సారథ్యంలో ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈరోజు ఢిల్లీలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందలేదు.
రాష్ట్రంపైనే దృష్టిసారించిన చంద్రబాబునాయుడు
తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రాంతీయ పార్టీల కూటమికానీ, కాంగ్రెస్ కూటమికానీ తమతో కలిసివస్తుందని భావించడంలేదు. చంద్రబాబునాయుడు కూడా రాష్ట్రపతి ఎన్నికలపై ఎక్కువగా దృష్టిపెట్టలేదు. ఆయన జాతీయ రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు. రాష్ట్రంలో విజయం సాధించడం, ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడం అనేదానిపైనే వ్యూహరచన చేస్తున్నారు. ఆ తర్వాతే ఢిల్లీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రతి ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఎవరికి మద్దతిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఓట్ల విలువ తక్కువే అయినా అవి ఎన్డీయేకు కీలకం!
టీడీపీ ఓట్ల విలువ తక్కువే అయినప్పటికీ అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి మాత్రం అవి చాలా విలువైనవి. తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇప్పటికే 1.2 శాతం ఓట్ల విలువ తక్కువగా ఉంది. వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే మద్దతిస్తాయనే ధీమాలో బీజేపీ నేతలున్నారు. చంద్రబాబునాయుడు కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతివ్వచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదో ఒక రాజకీయ కారణం చెప్పి ఎన్డీయే అభ్యర్థికే తెలుగుదేశం పార్టీ ఓట్లు వేస్తుందని, ప్రస్తుతం రిస్క్ రాజకీయాలు చేసే ఉద్దేశంలో తమ పార్టీ లేదని నేతలు వెల్లడిస్తున్నారు.












Click it and Unblock the Notifications