YS Jagan Birthday : జగన్ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పాలా ? రూ.10 చెల్లిస్తే చాలు-పోస్టల్ శాఖ స్పెషల్ !
ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు. ఆ రోజున శుభాకాంక్షలు చెప్పేందుకు వైసీపీ నేతలు ఇప్పటి నుంచే విభిన్న మార్గాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ అభిమానులతో పాటు పార్టీ నేతలు, అధికారులు ఏదో ఒక రూపంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతగా జగన్ కు ఉన్న ఫాలోయింగ్ ను బట్టి చూస్తే ప్రతీ ఒక్కరూ జగన్ కు శుభాకాంక్షలు చెప్పడం కష్టం కూడా. ఇందుకోసం తపాలాశాఖ ఓ సౌకర్యాన్ని అందిస్తోంది.
ఈ నెల 21న సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, పార్టీ నేతలు, సాధారణ ప్రజలు సైతం ఆయనకు శుభాకాంక్షలు అందించాలంటే తాము అందిస్తున్న సౌకర్యం వినియోగించుకోవాలని తపాలాశాఖ అధికారులు కోరుతున్నారు. ఇందుకోసం కేవలం రూ.10 చెల్లిస్తే చాలంటున్నారు. పోస్టాఫీసులకు వెళ్లి కేవలం 10 రూపాయలు చెల్లించడం ద్వారా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా పంపొచ్చని అధికారులు చెప్తున్నారు. దీంతో ఈసారి తపాలాశాఖ ద్వారా జగన్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇంతకీ తపాలాశాఖ జగన్ కు శుభాకాంక్షలు ఎలా అందిస్తుందో తెలుసా ? ఈ పోస్ట్ ద్వారా జనం పంపే శుభాకాంక్షల్ని జగన్ కు నేరుగా వెళ్లేలా పంపేందుకు తపాలాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదుపాయాన్ని అందరూ వాడుకోవాలని తపాలాశాఖ అధికారులు కోరుతున్నారు. పోస్టాఫీస్ కౌంటర్ కు వెళ్లి రూ.10 చెల్లిస్తే ఈ-పోస్ట్ ద్వారా జగన్ కు పంపే వారి పేరు, అడ్రస్ తో శుభాకాంక్షలు పంపుతామని తపాలాశాఖ అధికారులు చెబుతున్నారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21న ఈ సదుపాయం అందుబాటులో ఉంచనున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications