తెలంగాణ నుంచి వచ్చిన ఐఏఎస్‌లకు పోస్టింగ్స్: ఆమ్రపాలికి ఏ శాఖ అంటే?

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన ఐఏఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కార్మికశాఖ ముఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కార్మికశాఖ అదనపు బాధ్యతల నుంచి ఎంఎం నాయక్‌ను రిలీవ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణను ప్రభుత్వం నియమించింది. జాతీయ హెల్త్‌ మిషన్‌ డైరక్టర్‌గానూ ఆమెకు అదనపు బాధ్యతలు కేటాయించారు. ఆమ్రపాలి కాటను ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీ, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఏపీ టూరిజం అధారిటీ సీఈఓ గాను పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చింది.

Postings for IAS from Telangana Which branch is for Amrapali

పురావస్తు, మ్యూజియం శాఖ కమిషనర్ జై వాణీ మోహన్‌​ను సాధారణ పరిపాలన శాఖలో సర్వీసుల వ్యవహారాల ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఆ బాధ్యతలు చూస్తున్న పోల భాస్కర్‌​ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వుల్లో వెల్లడించింది.

కాగా, కొద్ది రోజుల క్రితమే ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేసిన విషయం తెలిసిందే. ఆమ్రపాలి, వాకాటి అరుణ, వాణి ప్రసాద్, రోనాల్డ్ రోస్, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్​కు రిపోర్టు చేశారు. డీఓపీటీ ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించడంతో వీరంతా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు ఏపీ ప్రభుత్వం తాజాగా పోస్టింగ్స్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+