Power Crisis In AP : విద్యుత్ సంక్షోభం అంచున ఏపీ-పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు దాదాపు పూర్తి

ఏపీలో విద్యుత్ సంక్షోభం తప్పేలా లేదు. దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వల కొరత ఏర్పడటం, కేంద్రం నుంచి తగినంత సహకారం లభించకపోవడం వంటి కారణాలతో ఏపీలోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు బొగ్గు సంక్షోభం బారిన పడ్డాయి ఇప్పటికే చాలా వరకూ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు దాదాపు అంతరించిపోయాయి. దీంతో కొన్ని రోజులుగా సగం కెపాసిటీ మేరకే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా విద్యుత్ కోతలు విధించడం మినహా మరో మార్గం కనిపించడం లేదు.

బొగ్గు, విద్యుత్ సంక్షోభాలు

బొగ్గు, విద్యుత్ సంక్షోభాలు

దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు సంక్షోభం ప్రభావం ఏపీపైనా పడుతోంది. తెలంగాణలోని సింగరేణి గనులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోని పవర్ ప్లాంట్లకు రావాల్సిన బొగ్గు నిల్వలు దాదాపుగా నిలిచిపోవడంతో పవర్ ప్లాంట్లు అల్లాడుతున్నాయి. దీంతో రోజువారీ ఉత్పత్తి చేయాల్సిన విద్యుత్ లో సగం కూడా ఉత్పత్తి చేయలేని పరిస్ధితులు నెలకొంటున్నాయి. రాష్ట్రంలోని ఎన్టీపీఎస్, ఆర్టీపీఎస్, వీటీపీఎస్, ఎస్టీపీఎస్, ఎంటీపీఎస్ ఇలా ఎక్కడ చూసినా బొగ్గు సంక్షోభం రాజ్యమేలుతోంది. దీంతో ఆయా ప్లాంట్లు ఉత్పత్తిలో కోతలు విధించుకోక తప్పని పరిస్ధితులు తలెత్తాయి. ఈ ప్రభావం సహజంగానే విద్యుత్ ఉత్పత్తిపై పడుతోంది.

 ఏపీలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం

ఏపీలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం

ఏపీలోని 9 ధర్మల్ విద్యుత్ ఆధారిత ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో విశాఖ జిల్లా పరవాడలోని ఎన్టీపీసీ సింహాద్రి సూపర్ ధర్మల్ పవర్ ప్లాంట్లో 2000 మెగావాట్లు, గాజువాకలోని వీటీపీఎస్ లో 1040 మెగావాట్లు, విజయవాడలోని ఎన్టీపీఎస్ లో 1760 మెగావాట్లు, కడప జిల్లా ముద్దనూరులోని ఆర్టీపీఎస్ లో 1650 మెగావాట్లు,. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని డీఎస్టీపీఎస్ లో 1600 మెగావాట్లు, సింహపురి ధర్మల్ పవర్ స్టేషన్లో 600 మెగావాట్లు, మీనాక్షి ధర్మల్ పవర్ స్టేషన్లో 1000 మెగావాట్లు, సెంబ్ కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ లో 1320 మెగావాట్లు, ఎస్జీపీఎల్ పవర్ స్టేషన్లో 1320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ఈ మొత్తం ప్లాంట్లు కలిపి 12 వేల 290 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది.

ఇప్పటికే సగం కెపాసిటీతో పనిచేస్తున్న ప్లాంట్లు

ఇప్పటికే సగం కెపాసిటీతో పనిచేస్తున్న ప్లాంట్లు


రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత కారణంగా సగం ఉత్పత్తే సాధ్యమవుతోంది. కొన్ని రోజులుగా ఇదే పరిస్ధితి. ప్రభుత్వ, ప్రైవేటు అన్న తేడా లేకుండా ప్రతీ ప్లాంట్ బొగ్గు కొరత ఎదుర్కొంటోంది. ఆయా ప్లాంట్లు పూర్తిగా పనిచేయకపోవడంతో ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి కూడా భారీగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపుగా బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. రేపు, ఎల్లుండి కల్లా మిగిలిన నిల్వలు కూడా తరిగిపోయే ప్రమాదం పొంచి ఉంది. అప్పుడు ధర్మల్ విద్యుత్ ప్లాంట్లన్నీ మూతపడటం ఖాయంగా కనిపిస్తోంది. బొగ్గు కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో ప్రతిరోజూ దాదాపు 2000 మెగావాట్లపైగా కొరత ఏర్పడుతోంది. ఇది ఇవాళ రేపట్లో మరింత ఎక్కువ కానుంది. సంక్షోభం తీవ్రతరం అయితే, డిస్కమ్‌లు బహిరంగ మార్కెట్ నుండి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నట్లుప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

 విద్యుత్ కోతలు మొదలు

విద్యుత్ కోతలు మొదలు

దాదాపు అన్ని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లలోనూ బొగ్గు నిల్వలు నిండుకోవడంతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై ఆ ప్రభావం పడుతోంది. దీంతో విద్యుత్ కోతలు విధించక తప్పని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఇవాళ ప్రకాశం జిల్లాలో విద్యుత్ కోతలు అధికారికంగానే మొదలయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు పవర్ కట్స్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు .ప్రస్తుతానికి పరిశ్రమలు, వ్యవసాయం, పట్టణ ప్రాంతాలకు యథావిధిగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. బొగ్గు కొరత ఏర్పడటంతో మరో 20 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. వ్యవసాయానికి మాత్రం కోతలు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Recommended Video

    AP CM Has Maintained His Cool In Pawan Kalyan Matter | Oneindia Telugu
    చేతులెత్తేసిన సర్కార్

    చేతులెత్తేసిన సర్కార్

    ఏపీలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతున్నా ప్రభుత్వం మాత్రం కేంద్రంపై భారం వేసి చోద్యం చూస్తోంది. లేకపోతే బహిరంగ మార్కెట్ లో ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్దితి నెలకొంటోంది. అలా చేయాలన్నా ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు ఉండాలి. కానీ అలాంటి పరిస్ధితి లేదు. దీంతో ఓవైపు బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతోంది. విద్యుత్ కోతలు తప్పేలా లేవని, ప్రజలు అందుకు సిద్ధం కావాలంటూ ప్రజా భద్రతా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ప్రకటించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+