స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ఆసక్తి రేపుతున్న పవన్ కళ్యాణ్ ట్వీట్స్
హైదరాబాద్: జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను పోస్ట్ చేశారు.
ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలుపడంలోనూ తనదైన శైలిలో ఆయన స్పందించారు. 'పర్వతం ఎవ్వడికీ ఒంగి సలాం చెయ్యదు' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఆయన పేర్కొన్నారు.

ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ కావ్యాన్ని ప్రస్తావిస్తూ ట్విట్టర్లో ఆయన ట్వీట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరుగదు. పర్వతం ఎవ్వడికీ ఒంగి సలాం చెయ్యదు. నేనంతా ఓ పిడికెడు మట్టే కావచ్చు. కానీ కలమెత్తితే, ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది'' అంటూ ఎలుగెత్తిన శేషేంద్ర శర్మ కవితను పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
‘‘కవి శేషేంద్ర చెప్పిన పై భావనే మనలో దేశం పట్ల ఉండాలి. దేశ పురోభివృద్ధి, సమైక్యత కోసం మనం శక్తిమేర కృషి చేయాల్సిందే'' అని కూడా పవన్ వ్యాఖ్యానించారు.
My wholehearted 'Independence Day'wishes to you all, JaiHind!
— Pawan Kalyan (@PawanKalyan) August 14, 2015 We should do what we can from where we are to the 'Progress & Integrity' of our 'Motherland Bharath'.
— Pawan Kalyan (@PawanKalyan) August 14, 2015 These lines from Poet 'Seshendra' reminds us the kind of Spirit we should have towards our Nation.
— Pawan Kalyan (@PawanKalyan) August 14, 2015 నేనింతా ఒక పిడికెడు మట్టే కావచ్చు కాని కలమెత్తితే ఒక దేశపు జండా కున్నంత పొగరుంది."- శేషంద్ర
— Pawan Kalyan (@PawanKalyan) August 14, 2015 "సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు,తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతంఎవ్వడికి ఒంగి సలామ్ చెయ్యదు,
— Pawan Kalyan (@PawanKalyan) August 14, 2015 -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications