చంద్రబాబు ఓ యాక్టర్‌ను తెచ్చుకుంటాడు: పవన్ కల్యాణ్‌పై జగన్ విసుర్లు
అనంతపురం: తన విమర్శలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపైకి ఎక్కుపెడుతూ పరోక్షంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు చేశారు. తనను ప్రజలు నమ్మరేమోనని చంద్రబాబు ఈసారి ఎవరో ఒకర్ని తన పక్కనపెట్టుకుంటారని ఆయన అన్నారు.
Recommended Video

చదవండి: ఇలాగేనా: పవన్ కళ్యాణ్ తీరుపై టీడీపీ అసహనం, చంద్రబాబుకు చికాకు?
ఒక సినిమా యాక్టర్‌నో మరొకరినో తెచ్చుకుంటారని, ఆ యాక్టర్ చంద్రబాబు గురించి చెబుతారని, నాదీ పూచీ చంద్రబాబుకు ఓటేయండి అంటారని, అలాంటి పరిస్థితి మారాలని ఆయన గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చంద్రబాబుకు మద్దతు ఇవ్వడంపై వ్యాఖ్యానించారు.
చదవండి: "చంద్రబాబు ప్యాకేజీలతో పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు.."

విశ్వసనీయతకే పట్టం కట్టాలి..
విశ్వసనీయతకు పట్టం కట్టాలని జగన్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఎన్నికలప్పుడు చెప్పిన ప్రతిదీ చేయాలి...
ఎన్నికల సందర్భంగా నాయకుడు ప్రజలకు చెప్పిన ప్రతిదీ చేయాలి, లేకుంటే ఆ నాయకుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి రావాలని జగన్ అన్నారు.జగన్‌కు మీరంతా తోడుగా, అండగా ఉన్నప్పుడే ఈ వ్యవస్థ మారుతుందని అన్నారు. వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు అందరూ కలిసి రావాలని వైఎస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

బాబు పాలన పోవాలి....
వ్యవస్థలో విశ్వసనీయత రావాలన్నా, రాజకీయాలు మారాలన్నా.. అబద్ధాలు చెప్తూ, మోసాలు చేసే చంద్రబాబు పాలన పోవాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబులాంటి వ్యక్తుల్ని క్షమిస్తే.. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు ఆయన ఈసారి కొత్త ఎత్తులు వేస్తారని, ప్రతి ఇంటికీ కిలోబంగారం ఇస్తానని, ప్రతి ఇంటికీ ఒక మారుతికారు కొని ఇస్తానని చంద్రబాబు చెప్తారని, ఇలాంటి వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని అన్నారు.

బాబులాంటి వ్యక్తుల్ని క్షమిస్తే...
చంద్రబాబులాంటి వ్యక్తుల్ని క్షమిస్తే.. మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు ఆయన ఈసారి కొత్త ఎత్తులు వేస్తారని, ప్రతి ఇంటికీ కిలోబంగారం ఇస్తానని, ప్రతి ఇంటికీ ఒక మారుతికారు కొని ఇస్తానని చంద్రబాబు చెప్తారని, ఇలాంటి వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదని వైఎస్ జగన్ అన్నారు.

హోదాపై చంద్రబాబు ఇలా అన్నారు.
పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా సంజీవనీ అన్నాడని, హోదా ఐదేళ్లు, పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలని అన్నాడని జగన్ అన్నారు.15 ఏళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పాడని, ఈ నాలుగేళ్ల బాబు పాలనలో ప్రత్యేక హోదా వచ్చిందా? రాలేదుహోదాను చంద్రబాబు అమ్మేశాడని అన్నారు.

వీడియో టేపుల్లో దొరికిన సిఎం
అవినీతి సొమ్ముతో ఆడియో టేపులు, వీడియోటేపులతో అడ్డంగా దొరికిపోయిన ఏకైక సీఎం బాబు అని, తన మీద ఉన్న కేసుల కోసం నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని జగన్ అన్నారు ఎవరైనా అవినీతి చేస్తూ దొరికిపోతే ఆ వ్యక్తి ఉద్యోగం ఊడుతుందని అన్నారు. అక్షరాల రాష్ట్రాన్ని దోచేసి.. ఆ సొమ్మునుంచి నల్లధనాన్ని పంచుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తన కేసుల నుంచి బయటపడేందుకు హోదాను పూర్తిగా తాకట్టు పెట్టారని అన్నారు.

అంతటా లంచాలు తీసుకుంటున్నారు...
ఇసుక, బొగ్గు, కాంట్రాక్టులు, రాజధాని భూములు నుంచి గుడుల భూముల వరకు ప్రతిచోటా లంచాలు తీసుకుంటున్నారని జగన్ అన్నారు. గ్రామాల్లో సైతం లంచాలు.. లంచాలు తీసుకుంటున్నారని, అవినీతి పర్వాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications