వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇలాగేనా: పవన్ కళ్యాణ్ తీరుపై టీడీపీ అసహనం, చంద్రబాబుకు చికాకు?

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ప్రతిపక్ష వైసీపీ అధికార టీడీపీ నేతగా భావిస్తోంది. చంద్రబాబుకు మద్దతుగానే ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా బయటకు వస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. వైసీపీ ఎలా అనుకున్నప్పటికీ పవన్ మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు చికాకు తెప్పిస్తున్నారని అంటున్నారు.

చదవండి: పరిటాల గుండు కొట్టించలేదు, నేనే, ఊరుకునేవాడినా: పవన్, వంగవీటి రంగా హత్య, కులపిచ్చిపైనా..

పవన్ షూటింగ్ గ్యాప్‌లో మాత్రమే ప్రజా సమస్యలపై స్పందించేందుకు వస్తున్నారని వైసీపీ విమర్శిస్తోంది. పవన్ కూడా పరోక్షంగా ఈ విషయాన్న అంగీకరిస్తున్నారు. అందుకే ఇక సినిమాలు చేయవద్దని నిర్ణయించుకున్నారు. ఆయన పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే అప్పుడు పరిస్థితి వేరుగా ఉండవచ్చు.

చదవండి: వైసీపీ ప్రశ్న: అనూహ్య నిర్ణయం తీసుకున్న పవన్, నేను ముఖ్యమంత్రిని అయితే...

చదవండి: పవన్! అల్లు అరవింద్‌పై ఏడవకు: కత్తి మహేష్, చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్‌పై వైసీపీకి అదే ఆయుధం

పవన్ కళ్యాణ్‌పై వైసీపీకి అదే ఆయుధం

కానీ ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై స్పందించడం వైసీపీకి ఆయుధంగా మారింది. మూడేళ్లుగా ఆయన పలు సందర్భాల్లో బయటకు వచ్చారు. ఆరు నెలలకు ఓసారి అన్నట్లుగా వచ్చారు. త్వరలో మాత్రం పూర్తిగా రాజకీయాలకు సమయం కేటాయించనున్నారు. అప్పుడు వైసీపీకి ఈ ఆయుధం మాత్రం ఉండదని చెప్పవచ్చు.

చికాకు తెప్పిస్తున్న పవన్, మిత్రుడిగానే టీడీ

చికాకు తెప్పిస్తున్న పవన్, మిత్రుడిగానే టీడీ

వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చినప్పుడల్లా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం, టీడీపీ వివరణ ఇచ్చుకోవడం జరుగుతోందని టీడీపీ నేతలు కూడా కొందరు అసంతృప్తికి లోనవుతున్నారట. చంద్రబాబు పరిస్థితి కూడా ఇలాగే ఉందని అంటున్నారు. పవన్‌ను వారు ఇంకా మిత్రుడిగానే చూస్తున్నప్పటికీ ఆయన మాత్రం తాను ప్రజల పక్షమని చెబుతున్నారు.

జగన్‌పై ఎదురుదాడి, పవన్‌పై తప్పనిసరి పరిస్థితుల్లో

జగన్‌పై ఎదురుదాడి, పవన్‌పై తప్పనిసరి పరిస్థితుల్లో

వైసీపీ అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ నేతలు చేసే విమర్శలపై టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పవన్ సమస్యలపై స్పందించినప్పుడు మాత్రం కొంత సానుకూలంగా మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యలను ఎవరు లేవనెత్తినా తాము పరిష్కారానికి మొగ్గు చూపుతామని చెబుతున్నారు. పవన్‌ను దూరం చేసుకోలేని తప్పనిసరి పరిస్థితుల్లోనే వారు అలా మాట్లాడుతున్నారని భావిస్తున్నారు.

పవన్ చెప్పినా, టీడీపీ లెక్కలు ఇవీ

పవన్ చెప్పినా, టీడీపీ లెక్కలు ఇవీ

పవన్ కళ్యాణ్ కులానికి, మతానికి దూరంగా ఉంటున్నారు. తనను ఒక్క కులానికి ఆపాదించవద్దని పదేపదే చెబుతున్నారు. అయినప్పటికీ ఆయనతో బాగుండేందుకే టీడీపీ ఆసక్తి కనబరుస్తోంది. పవన్ కులానికి దూరంగా ఉన్నప్పటికీ.. ఆయన వల్ల యువత, కాపు ఓట్లు దక్కుతాయని టీడీపీ భావిస్తోంది. అందుకే ఆయనను దూరం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు.

పవన్ విమర్శలపై టీడీపీ కలత

పవన్ విమర్శలపై టీడీపీ కలత

వైసీపీ విమర్శలను టీడీపీ నేతలు లెక్క చేయడం లేదు. వారివి అర్థం లేని విమర్శలు అని కొట్టి పారేస్తున్నారు. కానీ పవన్ బయటకు వచ్చినప్పుడు, ఆయన సంధించే ప్రశ్నలకు మాత్రం కచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. ఆయన చేసే తీవ్ర విమర్శలపై టీడీపీ కలత చెందుతోందని అంటున్నారు. పవన్ చేసే తీవ్ర విమర్శలపై టీడీపీ ఆందోళనగా ఉందని చెబుతున్నారు.

టీడీపీకి గట్టి వార్నింగ్

టీడీపీకి గట్టి వార్నింగ్

రాజధాని పర్యటన మొదలు నిన్నటి పోలవరం ప్రాజెక్టు పర్యటన వరకు పవన్ కళ్యాణ్.. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. పోలవరం విషయంలో ఓ అడుగు ముందుకేసి.. ప్రాజెక్టు విషయంలో కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తోందని, లెక్క చెప్పాలని అడుగుతోందని, చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకుంటే లెక్కలు చెప్పవచ్చుగా అని నిలదీశారు. తన నాలుగు రోజుల పర్యటనలో టీడీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. వీటిపై టీడీపీ నేతలు అసంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan Hits out at the BJP and Telugu Desam Party in his Andhra Pradesh four day tour. TDP unhappy with his attitue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X