జూన్ 1న మిధునరాశిలో మూడు గ్రహాల సంయోగంతో నక్కతోక తొక్కే రాశులివే!
ఈ రోజు జూన్ 1 2026 సోమవారం, నేడు నవగ్రహాల స్థితిని గమనిస్తే సూర్యుడు వృషభ రాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో మరియు రోజు ద్వితీయార్ధంలో ధనూ రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు బుధుడు మరియు గురుడు మిథున రాశిలో, శుక్రుడు మేష రాశిలో, శని మీన రాశిలో, రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాలు ద్వాదశ రాశులవారి జాతకాలను ప్రభావితం చేస్తాయి.
మేష రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు పనిభారం పెరిగినప్పటికీ మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృషభ రాశి
మీ రాశిలోనే సూర్యుడి సంచారం వల్ల కోపం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి.
మిథున రాశి
మీ రాశిలో గురు కుజ బుధ గ్రహాల ప్రభావం వల్ల ఆలోచనలు వేగంగా మారుతుంటాయి. నూతన పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలం. కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కర్కాటక రాశి
సంతాన పక్షం నుండి శుభవార్తలు వింటారు. గతంలో నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాల సూచన ఉంది. ఇది మీకు లాభదాయకంగా మారుతుంది.
సింహ రాశి
గ్రహాల అనుకూలత వల్ల గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. నూతన వాహనాలు లేదా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కన్యా రాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ తోబుట్టువుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. చిన్నపాటి ప్రయాణాలు చేయవలసి రావచ్చు .వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
తులా రాశి
ఆర్థిక పరంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. రావలసిన పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబంలో శుభకార్యాల గురించిన చర్చలు జరుగుతాయి. మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు .అయితే పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.
వృశ్చిక రాశి
చంద్రుని సంచారం వల్ల రోజంతా ఉత్సాహంగా చురుగ్గా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఉద్యోగంలో పదోన్నతి లేదా స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది.
ధనుస్సు రాశి
రోజు ప్రారంభంలో కొంత మానసిక ఆందోళన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి మధ్యాహ్నం తర్వాత సానుకూల మార్పు వస్తుంది. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది శత్రువులపై విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మకర రాశి
ఈ రోజు మీకు అయాచిత ధనలాభం కలిగే అవకాశం ఉంది. దీర్ఘకాలిక కోరికలు నెరవేరుతాయి. పెద్దల ఆశీస్సులు మద్దతు మీకు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు సొంతమవుతాయి. రోజంతా సంతోషంగా గడుస్తుంది.
కుంభ రాశి
రాహువు సంచారం ఉన్నప్పటికీ ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. రాజకీయ, ప్రభుత్వ రంగాల వారికి అనుకూలమైన రోజు. వ్యాపారంలో పోటీదారులపై విజయం సాధిస్తారు. తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
మీన రాశి
మీ రాశిలో శని సంచారం వల్ల పనులలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ అంతిమంగా విజయం మీదే అవుతుంది. ఈ రోజు అదృష్టం వరిస్తుంది. తీర్థయాత్రలు లేదా పుణ్యక్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుంది. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి.
గమనిక: ఇవి గోచార గ్రహ స్థితుల ఆధారంగా ఇవ్వబడిన సాధారణ ఫలితాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతక చక్రం జన్మ నక్షత్రం మరియు ప్రస్తుతం జరుగుతున్న దశాంతర్దశల ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉండవచ్చు













Click it and Unblock the Notifications