వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్! అల్లు అరవింద్‌పై ఏడవకు: కత్తి మహేష్, చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ చేసే ట్వీట్‌లో, పవన్ మాట్లాడే మాటల్లో ఆయన తప్పులు వెదికే పనిలో పడ్డట్లుగా కనిపిస్తోంది. తనకు కులాలు, మతాలు ముఖ్యం కాదని, మానవత్వమే ముఖ్యమని పవన్ చెబుతున్నారు.

వారసత్వంపై పవన్ కళ్యాణ్‌కు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ ఆస్తుల ప్రకటనపై సెటైర్వారసత్వంపై పవన్ కళ్యాణ్‌కు లోకేష్ దిమ్మతిరిగే కౌంటర్, జగన్ ఆస్తుల ప్రకటనపై సెటైర్

పవన్ కళ్యాణ్ ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం విశాఖలో, గురువారం రాజమహేంద్రవరం, శుక్రవారం విజయవాడలో పర్యటించారు. శనివారం ఒంగోలులో బోటు ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై కత్తి మహేష్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.

 అల్లు అరవింద్‌పై ఇప్పుడు ఏడవడం ఇంకా తప్పు

అల్లు అరవింద్‌పై ఇప్పుడు ఏడవడం ఇంకా తప్పు

అల్లు అరవింద్‌పై పవన్ కళ్యాణ్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలకు కత్తి మహేష్ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఏడవడం తప్పు కాదని, కానీ చేతకాక, చెప్పుకోలేక ఏడవడం తప్పని, ఆ విషయం ఇప్పుడు చెప్పి అల్లు అరవింద్ మీద పడి ఏడవడం అసలు తప్పు అని నిప్పులు చెరిగారు.

 రిజర్వేషన్లతోనే నీ వైఖరి తేలిపోయింది

రిజర్వేషన్లతోనే నీ వైఖరి తేలిపోయింది

కాపు సామాజిక వర్గం మీ అన్నయ్య (చిరంజీవి) చేసిన అన్యాయానికి నీ నుంచీ ప్రతిఫలం ఆశిస్తోందని, ఆల్రెడీ మావోడు వస్తున్నాడని డప్పు కొట్టేశారని, నేను విశ్వమానవుడ్ని. నాకు కులం లేదు వంటి ఉబుసుపోని కబుర్లు చెప్పవద్దని, కాపు రిజర్వేషన్లపై నీ వైఖరి నీ సహజ ప్రవృత్తిని చెప్పేసిందన్నారు.

 చిరంజీవి మోసం చేశాడు, ఇప్పుడు నువ్వొచ్చావ్

చిరంజీవి మోసం చేశాడు, ఇప్పుడు నువ్వొచ్చావ్

చిరంజీవి సామాజిక న్యాయం అంటే అందరం నమ్మామని, మోసం చేసి పోయాడని, రాజకీయంగా కాపులను, బహుజనులు, దళితులను, మైనార్టీలను ఒక పాతిక సంవత్సరాలు వెనక్కి తీసుకుని పోయాడని, ఇప్పుడు నువ్వొచ్చావని కత్తి మహేష్ తీవ్రంగా మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ అలా ఐతే ఎన్జీవో పెట్టుకో

పవన్ కళ్యాణ్ అలా ఐతే ఎన్జీవో పెట్టుకో

నాకు కులం లేదని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, ఏపీ రాజకీయాలలో ఉన్నదే కులమని, అధికారం వద్దు అంటున్నావని, రాజకీయం చేసేదే గెలుపు కోసం, అధికారం కోసమని ధ్వజమెత్తారు. అవి అవసరం లేకుండా సేవ చెయ్యాలంటే ఎన్జీవో పెట్టుకోవాలని, రాజకీయాలు ఎందుకని నిలదీశారు. కాస్త తెలుసుకుని మాట్లాడాలని, గ్రౌండ్ రియాలిటీ గ్రహించాలన్నారు. తుని ఘటన జరిగినప్పుడు కేరళ నుంచి హుటాహుటిన ప్ర‌త్యేక విమానంలో వచ్చిన ఈ విశ్వ మానవుడు, మరే ఇతర కుల సమస్య గురించి ఒక్కసారైనా ఎందుకు స్పందించలేదని మ‌హేశ్ క‌త్తి విమర్శించారు.

English summary
Kathi Mahesh counter to Jana Sena Party chief Pawan Kalyan over Allu Aravind issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X