IPL 2026 Final: గుజరాత్ ఓటమికి అసలు సిసలైన విలన్ అతడే!

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ అత్యంత సులభంగా ఛేదించిన టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విక్టరీ వెనుక చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్ ప్రధాన కారణం కాగా.. గుజరాత్ ఓటమికి ఆ జట్టుకు చెందిన ఒకే ఒక్క ఓవర్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. గుజరాత్ టైటాన్స్ ఎంతో నమ్మకం పెట్టుకున్న స్టార్ పేసర్ కగిసో రబాడ వేసిన ఆ ఓవర్.. మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి, అతడిని గుజరాత్ ఓటమికి అసలు సిసలైన విలన్‌గా నిలబెట్టింది.

ఆర్సీబీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో గుజరాత్ కెప్టెన్ బౌలింగ్ వేసేందుకు రబాడకు బంతిని అప్పగించగా.. అప్పటికే క్రీజులో సెట్ అయి ఉన్న విరాట్ కోహ్లీ అతనిపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. రబాడ వేసిన మొదటి బంతికే లెంత్‌ను అంచనా వేసిన కింగ్ కోహ్లీ.. అద్భుతమైన షాట్‌తో బౌండరీ బాదాడు. ఆ తర్వాతి బంతికే రబాడ మళ్లీ అదే తప్పు చేయడంతో, కోహ్లీ తన మణికట్టు మాయాజాలంతో బంతిని బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా మలిపి వరుసగా రెండో ఫోర్ కొట్టాడు. బ్యాక్-టు-బ్యాక్ ఫోర్లతో రబాడ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాడు.

IPL 2026 Final The 19-Run Over By Kagiso Rabada That Cost Gujarat Titans The Trophy Details

ఇక ఓవర్ మూడో బంతికి కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌లోనే అత్యంత అద్భుతమైన సిక్సర్‌ను బాదాడు. రబాడ ఆఫ్ స్టంప్‌కు వెలుపల వేసిన మంచి లెంత్ బంతిని.. కోహ్లీ కాస్త ముందుకు వచ్చి వైడ్ మిడ్-ఆన్ మీదుగా గాల్లోకి లేపుతూ నేరుగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఈ సూపర్ సిక్సర్‌తో స్టేడియం మొత్తం కోహ్లీ నామస్మరణతో మారుమోగిపోయింది. రబాడ వేసిన నాల్గో బంతిని కూడా కోహ్లీ అంతే వేగంగా పుల్ షాట్ ద్వారా స్క్వేర్ లెగ్ బౌండరీ దాటించి మరో ఫోర్ ఖాతాలో వేసుకున్నాడు.

ఐదో బంతికి కోహ్లీ సింగిల్ తీయగా.. ఆఖరి బంతికి వెంకటేష్ అయ్యర్ ఎలాంటి పరుగు చేయలేకపోయాడు. అయినప్పటికీ రబాడ వేసిన ఆ ఒక్క ఓవర్‌లో 4, 4, 6, 4, 1 రూపంలో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్లో అంత భారీ స్కోర్ సమర్పించుకోవడంతో గుజరాత్ టైటాన్స్ వ్యూహాలన్నీ తలకిందులయ్యాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్‌కు విపరీతమైన వేగాన్ని ఇచ్చిన ఈ ఓవర్ కారణంగానే ఆ తర్వాత బెంగళూరు జట్టుకు లక్ష్య ఛేదనలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+