వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పని ప్రారంభించారు: జగన్ లోటస్‌పాండ్‌లో ప్రశాంత్ కిషోర్, మంతనాలు

2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను ఖాయం చేసుకున్నారని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ/హైదరాబాద్: 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను ఖాయం చేసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే ఆయన అనధికారికంగా సూచనలు చేస్తున్నారంటున్నారు.

పొలిటికల్ పంచ్... ట్విస్ట్: ప్రశాంత్ కిషోర్ సూచన జగన్‌ని దెబ్బతీసిందా? పొలిటికల్ పంచ్... ట్విస్ట్: ప్రశాంత్ కిషోర్ సూచన జగన్‌ని దెబ్బతీసిందా?

ఇప్పుడు, వైసిపికి - ప్రశాంత్ కిషోర్‌కు మధ్య దాదాపు ఒప్పందం కుదిరిందని అంటున్నారు. ఈ మేరకు ఆయన వైసిపి కోసం పని చేయడం ప్రారంభించారని అంటున్నారు. రెండు రోజుల క్రిందట హైదరాబాదులోని లోటస్ పాండులోని వైసిపి ఆఫీస్‌కు ప్రశాంత్ కిషోర్ వచ్చారని తెలుస్తోంది.

హోటల్లో ఉంటూ రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్

హోటల్లో ఉంటూ రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్

వైసిపి అధినేత జగన్ సన్నిహితులతో మంతనాలు జరిపారని తెలుస్తోంది. ఓ హోటల్లో ఉంటూ పార్టీ నేతలతో ఎప్పటికి అప్పుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు చేయాల్సిన రాజకీయ వ్యూహంపై ప్రశాంత్ కిషోర్ సమీక్షలు చేస్తున్నారని తెలుస్తోంది.

వైసిపి నేతలతో మంతనాలు

వైసిపి నేతలతో మంతనాలు

ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించనున్నారన్న వార్తల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ వైసిపి కార్యాలయానికి రావడం, జగన్ సన్నిహితులతో మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గెలుపు.. ప్రశాంత్ కిషోర్ ఫోకస్ అక్కడే

గెలుపు.. ప్రశాంత్ కిషోర్ ఫోకస్ అక్కడే

ప్రశాంత్ కిషోర్ గత సార్వత్రిక (2014) ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా ప్రచారం చేశారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించారు. ఇతర వ్యూహాలతో పాటు సోషల్ మీడియా కూడా ఆయన ప్రధాన అస్త్రం. నాడు బీజేపీ గెలుపు వెనుక సోషల్ మీడియా కూడా ఎంతో పని చేసింది. ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ కోసం పని చేశారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేశారు. ఇప్పుడు వైసిపి కోసం పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

భారీ ఒప్పందం

భారీ ఒప్పందం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్రశాంత్ కిషోర్‌తో రూ.250 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న జగన్ అంత భారీ మొత్తానికి ఆయనకు ఇచ్చేందుకు ఒప్పందం కుదురచుకున్నారని చెబుతున్నారు.

English summary
Prashant Kishor has rejected the reports of him being hired by YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X