వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి వెళ్లిపోండి!: జగన్‌కు ప్రశాంత్ కిషోర్ సూచన, 'సాక్షి' కూడా...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన సూచనతో పార్టీతో పాటు సాక్షి టీవీ వ్యవస్థను పెంచి, నవ్యాంధ్రకు తరలించనున్నారంటున్నారు.

పని ప్రారంభించారు: జగన్ లోటస్‌పాండ్‌లో ప్రశాంత్ కిషోర్, మంతనాలు పని ప్రారంభించారు: జగన్ లోటస్‌పాండ్‌లో ప్రశాంత్ కిషోర్, మంతనాలు

విభజన అనంతరం జగన్ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లి రావడం చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రులు, సచివాలయం అమరావతికి తరలింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు జగన్ విజయవాడ తరలనున్నారు.

సిద్ధమవుతున్న వైసిపి ఆఫీస్

సిద్ధమవుతున్న వైసిపి ఆఫీస్

ఇప్పటికే వైసిపి కార్యాలయం సిద్ధమవుతోంది. కాబట్టి విజయవాడలో సాక్షి మీడియా వ్యవస్థను కూడా పెంచడం అనివార్యమవుతుందని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనలతో జగన్, జగన్ సూచనలతో సాక్షి టీవీ వ్యవస్థ కదలనుంది.

ఏపిలో సెంట్రల్ డెస్క్

ఏపిలో సెంట్రల్ డెస్క్

అయితే, సాక్షి మీడియా ఏపీ జనరల్ డెస్క్ జగన్ సూచనలతో విజయవాడకు వెళ్లేందుకు సిద్ధమవుతోందంటున్నారు. సెంట్రల్ ఆఫీసు, హెడ్ ఆఫీస్ హైదరాబాదులో ఉన్నాయి. విజయవాడలో ఆఫీస్, ఎడిషన్ సెంటర్ వంటివి ఉన్నాయి. ప్రింటింగ్ కూడా అక్కడే. ఏపీ జనరల్ రిపోర్టింగ్ బ్యూరో కూడా ఏపీ నుంచే పని చేస్తోంది.

సాక్షి టీవీ వ్యవస్థను బెజవాడలో..

సాక్షి టీవీ వ్యవస్థను బెజవాడలో..

సాక్షి టీవీ వ్యవస్థను విజయవాడలో అప్ గ్రేడ్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఇరు తెలుగు రాష్ట్రాల కొందరు రాజకీయ ప్రముఖులు హైదరాబాదులోనే ఉండటంతో ఇబ్బంది ఉండటం లేదు.

అందుకే..

అందుకే..

కానీ రానున్న కాలంలో వారంతా విజయవాడకు తరలుతారు. మరోవైపు, జగన్ కూడా బెజవాడ తరలుతున్నారు. ఈ నేపథ్యంలో సాక్షి టీవీ వ్యవస్థను పెంచడం అనివార్యంగా మారింది.

English summary
It is said that elections strategist Prashanth Kishore suggested YSRCP chief YS Jagan to leave Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X