కొండ్రు చేరిక ఎఫెక్ట్: ముఖ్యమంత్రితో ప్రతిభాభారతి భేటీ, హామీ ఇచ్చిన చంద్రబాబు
అమరావతి: కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం ఇంఛార్జ్, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి సీఎం చంద్రబాబును కలవడం చర్చనీయాంవంగా మారింది. బుధవారం ఆయన నివాసంలో చంద్రబాబును కలిశారు ప్రతిభాభారతి.

రాజాం పరిస్థితిపై బాబుకు వివరణ
ఈ సందర్భంగా జిల్లాతోపాటు రాజాం నియోజకవర్గంలోని పరిస్థితులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో గ్రూపులు కట్టేలా కొందరు ప్రోత్సహిస్తున్నారని సీఎంకు ప్రతిభాభారతి ఫిర్యాదు చేశారు. అంతేగాక, మాజీ మంత్రి కొండ్రు మురళీ పార్టీలో చేరిక అంశంపై చంద్రబాబు వద్ద ప్రస్తావించారు.

ప్రతిభాభారతికి ప్రాధాన్యత తగ్గదంటూ బాబు హామీ..
అయితే, పార్టీ బలోపేతం కోసం చేరికలు కొనసాగుతాయని చంద్రబాబు ఆమెకు చెప్పినట్లు తెలిసింది. కానీ, పార్టీలో ప్రతిభాభారతికి అత్యంత ప్రాధాన్యత ఉందని, పార్టీలోకి ఎవరొచ్చినా అది ఏమాత్రం తగ్గదని చంద్రబాబు ఆమెకు భరోసా ఇచ్చారు. దీంతో ప్రతిభారతి సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ వైపు..
కాగా, కాంగ్రెస్ పార్టీ నేతలు కొండ్రు మురళి, ఉగ్రనరసింహా రెడ్డి వంటి కొందరు నేతలు ఇప్పటికే అధికార పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. కానీ నందమూరి హరికృష్ణ మృతితో పలువురి చేరిక ఆలస్యం అయింది.

కొండ్రు చేరిక.. బాబుతో భేటీ..
కొండ్రు మురళి గురువారం టీడీపీలో చేరనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహా రెడ్డి కూడా సైకిల్ ఎక్కే అవకాశాలు ఉన్నాయి. వీరి చేరిక ద్వారా పలువురు స్థానిక టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొండ్రు చేరికపై అసంతృప్తితో ఉన్న ప్రతిభా భారతి ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications