గర్భిణీ మహిళని డోలీలో ఆస్పత్రికి; అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన మహిళల పురిటికష్టాలు!!

శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన నేటి రోజులలో కూడా మారుమూల గిరిజన ప్రాంతాలలో ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న అడవి బిడ్డల పురిటి కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. గర్భిణీ గిరిజన మహిళలు ప్రసవం కోసం అడుగడుగున అగచాట్లు పడుతున్నారు. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకున్న సంఘటన అడవిబిడ్డల పురిటి కష్టాలకు అద్దం పడుతుంది.

డోలీలలో గర్భిణీ స్త్రీలను ఆస్పత్రికి తరలిస్తున్న గిరిపుత్రులు

డోలీలలో గర్భిణీ స్త్రీలను ఆస్పత్రికి తరలిస్తున్న గిరిపుత్రులు

మౌలిక సదుపాయాలు లేక ఏజెన్సీ వాసులు నిత్య నరకం చూస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు మండలంలో గర్భిణీ మహిళల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయింది. ప్రసవానికి గర్భిణీ స్త్రీలను ఇంకా డోలీలి కట్టి మోసుకు వెళ్ళాల్సి వస్తుంది. గర్భిణీ మహిళలకు పురిటి నొప్పులు వస్తే, వారిని ఆసుపత్రికి తరలించడానికి కూడారోడ్డు మార్గం లేనిపరిస్థితి వారి కష్టాలకు అద్దం పడుతుంది . దీంతో గర్భిణీ మహిళలనుడోలీకట్టిఅందులో ఆస్పత్రి వరకుకాలినడకన మోసుకువెళ్తున్నారు.

అరకు ఎంపీ మాధవి సొంత మండలంలోనూ గిరిజన మహిళల పురిటి కష్టాలు

అరకు ఎంపీ మాధవి సొంత మండలంలోనూ గిరిజన మహిళల పురిటి కష్టాలు


చాలా ప్రయాసలకు ఓర్చి మహిళలను ఆస్పత్రికి తరలించవలసి వస్తుంది. ఇక వాతావరణం అనుకూలిస్తే సరే, లేదంటే గర్భిణీ మహిళల తరలింపు వారికి కత్తి మీద సాముగా మారుతుంది. తాజాగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సొంత మండలంలోనే ఆదివాసీ గర్భిణీ స్త్రీకి డోలి కష్టాలు తప్పలేదు. సమీపంలో ఆస్పత్రి లేకపోవడంతో తొమ్మిది కిలోమీటర్లు రెండు ఎత్తయిన కొండలు దాటుకుంటూ శాంతి అనే గర్భిణీ మహిళను ఆసుపత్రికి తరలించడానికి నానా అగచాట్లు పడ్డారు గిరిజనులు.

రోడ్డుకు నిధులు ఇవ్వాలని, రోడ్ వెయ్యాలని గిరిపుత్రుల విజ్ఞప్తి

రోడ్డుకు నిధులు ఇవ్వాలని, రోడ్ వెయ్యాలని గిరిపుత్రుల విజ్ఞప్తి


రోడ్డు మార్గం లేకపోవటంతో అంబులెన్స్ లు కూడా రాని పరిస్థితి. ఉపాధి హామీ పథకం నుండి అయినా మెటల్ రోడ్డు నిధులు మంజూరు చేయండి మహాప్రభో అని గిరి పుత్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఐదు సంవత్సరాల నుండి శ్రమదానం చేస్తున్న నిధులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సదుపాయం లేకపోవడంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ మహిళలను డోలీలు కట్టుకుని తీసుకు వెళ్లాల్సిన పరిస్థితి పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గిరిజన ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించాలని వినతి

గిరిజన ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించాలని వినతి


అదృష్టం బాగుంటే గర్భిణీ మహిళలు క్షేమంగా ఇంటికి వస్తున్నారని, లేదంటే వారు మార్గమధ్యలోనే కొన్ని సందర్భాల్లో ప్రాణాలు విడుస్తున్నారు అని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజన గ్రామాల ప్రజల కష్టాలు అర్థం చేసుకోవాలని వారంటున్నారు. కేవలం ఓట్ల కోసమే కాకుండా గిరిజన ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూడా చొరవ చూపాలని కోరుతున్నారు. గిరిజన ప్రాంతాలలో కనీస వైద్య సదుపాయాలు కల్పించడానికి చొరవ చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+