రాజకీయాల్లో జగన్ ది రాంగ్ రూట్ కాదు ,ఆయనంత అహింసావాది లేరన్న పోసాని

విలక్షణ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళి జగన్ పై ఉన్న తన అభిమానాన్ని ప్రకటించారు. జగన్ ఎప్పుడూ రాంగ్ రూట్ లో వెళ్ళరని, చాలా టఫ్ మనిషి అంటూ ఆయనపై ప్రసంశల జల్లు కురిపించారు. ఇక చంద్రబాబుపై విరుచుకు పడ్డారు. రాజకీయాల్లో ప్రస్తుతం చంద్రబాబు వంటి నాయకుడి అవసరం లేదన్నారు.

ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళి . జీవితంలో తనకు ఓ కల, ఆకాంక్ష ఉండేదని చెప్పిన ఆయన అది వైఎస్ జగన్ సీఎం అవ్వడమని తెలిపారు . ఎట్టకేలకు నా జీవిత కల నెరవేరిందని పేర్కొన్నారు . ప్రస్తుత రాజకీయాల్లో జగన్ అంత అహింసావాది లేరని కొనియాడారు. జగన్ రాంగ్ రూట్ లో వెళ్లి స్వప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తి కాదని చెప్పుకొచ్చారు. ఆపని చేద్దాం, ఆ పదవి కొట్టేద్దామనే మనస్తత్వం జగన్ కు లేదని అన్నారు.

Present politics, Jagan is not in the wrong route, he is non-violent .. Posani said

జగన్ తాత రాజారెడ్డిలాగా అనుకున్నది సాధించే తత్వం అన్నారు . రాజారెడ్డి బాగా మంకుపట్టు పట్టే వ్యక్తి అని, మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అంత మంకు పట్టు పట్టరని అన్నారు. తన తాత రాజారెడ్డి కంటే వంద పర్సెంట్ జగన్ టఫ్ మనిషి అని అభిప్రాయపడ్డారు. ఏదైనా సరే తనకు కావాలంటే సాధించే మనస్తత్వం అని ఆయన పేర్కొన్నారు. జగన్ పై లేనిపోని ఆరోపణలు ఎవరెన్ని చేసినా ఆయన తనదైన శైలిలో జనాల్లోకి వెళ్ళారని గుర్తు చేశారు.

తనగురించి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదని, సత్ప్రవర్తన తనలో ఉంటే జనాలే ప్రేమిస్తారని భావించి ప్రజల్లోకి వెళ్ళారని పోసాని కృష్ణ మురళి కితాబిచ్చారు . ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో. తెలుగు దేశం పార్టీది ఇప్పడే ముగిసిన అధ్యాయం కాదని పేర్కొన్నారు . అయితే రాష్ట్రానికి మాత్రం టీడీపీ లాంటి పార్టీతో కాన, చంద్రబాబు వంటి నాయకుడు కానీ అవసరం లేదన్నారు పోసాని కృష్ణ మురళి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+