టీమిండియా స్ఫూర్తితో పనిచేయండి: వైఎస్ జగన్‌కు ఆ ఇద్దరి శుభాకాంక్షలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగులో ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ పురోగమింపజేయాలని అకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పథంలో మరంత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నట్లు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రజా సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, మహిళా సాధికారత లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పరిపాలన సాగించాలని సూచించారు.

పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కలిగి ఉండాలని చెప్పారు. 'టీమ్-ఇండియా' స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రం పని చేయాలని అన్నారు. ఆ దిశలో వైఎస్ జగన్ రాష్ట్రాన్ని ముందకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. తెలుగు ప్రజల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీస్వీకార ప్రమాణం చేస్తున్న సందర్భంగా శ్రీ వై ఎస్ జగన్ మోహన రెడ్డిగారికి రాష్ట్రపతి కోవింద్ శుభాభినందనలు తెలియచేశారు. రాష్ట్రపతి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆంధ్ర ప్రదేశ్‌ను ఆయన సరికొత్త శిఖరాలకు చేర్చగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. @ysjagan
— President of India (@rashtrapatibhvn) May 30, 2019
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను. తెలుగు ప్రజల అభివృద్ధికి నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. @ysjagan @YSRCParty #Jagan pic.twitter.com/Mnhw1Xf3iA
— VicePresidentOfIndia (@VPSecretariat) May 30, 2019
ప్రజా సంక్షేమం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, మహిళా సాధికారత లాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ, పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలను కలిగి కొనసాగిస్తూ ‘టీమ్-ఇండియా’ స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రం పని చేయాలని, ఆ దిశలో ముందుకు సాగుతారని ఆకాంక్షిస్తున్నాను. @ysjagan #Jagan #YSRCP #AndhraPradesh
— VicePresidentOfIndia (@VPSecretariat) May 30, 2019












Click it and Unblock the Notifications