వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాడు ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు..నేడు సీఎంగా ఆతిథ్యం: ఏపీకి రాష్ట్రప‌తి రాక‌: మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీకి వ‌స్తున్న రాష్ట్రప‌తి రామ్‌నాధ్ కోవింద్ || President Ramnath Kovind Arriving AP For Tour

రాష్ట్రప‌తి రామ్‌నాధ్ కోవింద్ మూడు రోజుల ప‌ర్య‌ట‌న కోసం ఏపీకి వ‌స్తున్నారు. ఆయ‌న త‌న ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధానంగా శ్రీవారి ద‌ర్శ‌నంతో పాటుగా శ్రీహ‌రి కోట‌లో చేయ‌నున్న ప్ర‌తిష్ఠాత్మ‌క ప్ర‌యోగాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తారు. ఏపీకి చేరుకుం టున్న రాష్ట్రప‌తి కోవింద్‌కు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. అక్క‌డ నుండి నేరు గా ఆయ‌న తిరుప‌తిలో దేవాల‌యాల‌ను ద‌ర్శించుకొని రాత్రికి తిరుమ‌ల చేరుకుంటారు. ఈ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌లో రాష్ట్రప‌తితో పాటుగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ సైతం వెంటే ఉండ‌నున్నారు.

నాడు మ‌ద్ద‌తు..నేడు ఆతిధ్యం..
రాష్ట్రప‌తి రామ్‌నాధ్ కోవింద్ ఏపీలో ప్ర‌భుత్వం మారి..జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత తొలి సారి ఏపీ ప‌ర్య‌ట‌న కు వ‌స్తున్నారు. శ‌నివారం సాయంత్రం 5.25 గంటలకు రేణిగుంట విమానాశ్రయం (చెన్నై నుండి) చేరుకుంటారు. ఆయ న‌కు రేణిగుంట విమానాశ్ర‌యంలో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌..ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తో స‌హా జిల్లా మంత్రులు..అధికారులు స్వాగ‌తం ప‌లుకుతారు. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్డీఏ ప్ర‌భుత్వం రామ్‌నాధ్ కోవింద్‌ను రాష్ట్రప‌తి అభ్య‌ర్దిగా ప్ర‌క‌టించ‌గానే..వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆయ‌న‌కే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

President Ramnath Kovind arriving Tirupati to day evening for Three days tour in AP.

అప్ప‌ట్లో దీని పైన విమ‌ర్శ‌లు వ‌చ్చాయి . కానీ, జ‌గ‌న్ మాత్రం రాష్ట్రప‌తి లాంటి ఎన్నిక‌లో పోటీ ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే..సంఖ్యా బ‌లం ఉండి గెలిచే అభ్య‌ర్దికే మ‌ద్ద‌తిచ్చామ‌ని స్ప‌ష్టం చేసారు. దీంతో..ఆయ‌న హైద‌రాబాద్‌లో వైసీపీ నేత‌ల‌తో ఎన్నిక ముందు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ ఆయ‌న‌కు పాదాభివంద‌నం చేసారు. దీని పైనా అప్ప‌ట్లో చ‌ర్చ జ‌రిగింది. తిరిగి ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రప‌తి హోదాలో వ‌స్తుండ‌గా..జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి హోదాలో ఆతిధ్యం ఇస్తున్నారు.

తిరుప‌తి..తిరుమ‌ల‌..శ్రీహ‌రికోట ప‌ర్య‌ట‌న‌..
ఈ సాయంత్రం రేణిగుంట చేరుకున్నాక రాష్ట్రప‌తి కోవింద్ అక్క‌డి నుండి 5.45 గంట‌ల‌కు తిరుచానూరు శ్రీప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారు. ఆ వెంట‌నే 6.15 గంల‌కు శ్రీక‌పిలేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకొన్నా..రాత్రి 7.05 గంట‌ల కు నేరుగా తిరుమ‌ల‌కు చేరుకుంటారు. అక్క‌డ ఆయ‌న‌కు బోర్డు ఛైర్మ‌న్ సుబ్బారెడ్డి..అధికారులు స్వాగ‌తం ప‌లుకుతా రు. అక్క‌డే రాత్రికి శ్రీప‌ద్మావ‌తి గృహంలో బ‌స చేస్తారు.

ఆదివారం ఉదయం 5.40 గంటలకు వరహస్వామిని దర్శించు కుంటారు. ఆ వెంట‌నే 6.00 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించు కుంటారు. ఇక‌, మ‌ధ్నామ్నం మూడు గంట‌ల‌కు తిరుమ‌ల‌లో బ‌య‌ల్దేరి 3.40 గంట‌ల‌కు హెలికాఫ్ట‌ర్‌లో శ్రీహ‌రికోట‌కు బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్నారు. సోమ‌వారం తెల్ల‌వారు జామున ఇస్రోలో జ‌రిగే ప్ర‌యోగాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షిస్తారు. ఆ త‌రువాత ఉద‌యం 10.10 గంట‌ల‌కు రేణిగుంట విమానా శ్ర‌యం చేరుకొని ఢిల్లీకి తిరుగు ప్ర‌యాణ‌మ‌వుతారు.

English summary
President Ramnath Kovind arriving Tirupati to day evening for Three days tour in AP. Governor and CM Jagan giving reception for President. He visit Tirumala and Sri Hari kota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X