ఏపీపై మోడీ స్పెషల్ ఫోకస్: ప్రధాని కొత్త సంప్రదాయం: టీటీడీ, శ్రీశైలం నుంచి ఢిల్లీకి అర్చకులు

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడూ లేని విధంగా ఓ సరికొత్త సంప్రదాయానికి తెర తీసినట్టు కనిపిస్తోంది. ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారనిపిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ- అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ ఈ వినూత్న సంప్రదాయానికి తెరతీయడం కాస్త ఆసక్తి రేపుతోంది. రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. ప్రధాని ఉద్దేశం ఏమిటనే విషయం మీద రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ ఏనాడూ ఆయన ఈ తరహా సంప్రదాయాన్ని అనుసరించలేదు. దీనికోసం ఆయన ఈ కొత్త సంవత్సరం వేడుకలను దీనికి వేదికగా చేసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల, శ్రీశైలం దేవస్థానాల అర్చకుల నుంచి ప్రధాని ఆశీర్వచనాలను పొందారు. ఆయా దేవస్థానాల తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. చేతికి కంకణాలను సైతం కట్టుకున్నారు. కొంతసేపు అర్చకులతో ముచ్చటించారు.

 Priests from Tirupati and Srisailam temples of AP, met PM Modi and gave him prasada

ప్రధానిని ఆశీర్వదించడానికి ఇవ్వాళ ఉదయం తిరుమల తిరుపతి, శ్రీశైలం దేవస్థానాల అర్చకులు దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యాహ్నం మోడీని కలిశారు. ఆయనను ఆశీర్వదించారు. వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలు పలికారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల తీర్థ ప్రసాదాలను అందించారు. శ్రీవారి శేషవస్త్రాన్ని భుజాలపై కప్పి, తీర్థ ప్రసాదాలను అందించారు. చేతికి కంకణాలు కట్టారు. వేద మంత్రాలతో ప్రతిధ్వనించింది.

 Priests from Tirupati and Srisailam temples of AP, met PM Modi and gave him prasada

ఈ తరహాలో ప్రధాని ఇదివరకెప్పుడూ తిరుమల, శ్రీశైలం దేవస్థానాల నుంచి అర్చకులను పిలిపించుకోలేదు. ఆ మాటకొస్తే- శ్రీశైలం దేవస్థానాన్ని ఎప్పుడూ సందర్శించనూ లేదు. ప్రధాని హోదాలో ఒకట్రెండు సార్లు ఆయన తిరుమలకు వచ్చారు. శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీశైలం మల్లన్న గుడికి ఇప్పటిదాకా వెళ్లలేదు. ఈ పరిస్థితుల్లో ఈ రెండు దేవస్థానాల అర్చకులను ఢిల్లీకి పిలిపించుకుని ఆశీర్వాదం పొందడంపై రాష్ట్రంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఏపీ మీద మోడీ ప్రత్యేకంగా దృష్టి సారించారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమౌతున్నాయి. దానికి సంకేతంగా ఏపీలోని రెండు ప్రఖ్యాత దేవాలయాల నుంచి అర్చకులను పిలిపించుకుని.. ఆశీర్వచనాలు తీసుకుని మరీ తాను అనుకున్నది చేసేలా ఉన్నారని అంటున్నారు నెటిజన్లు. దీనిపై భిన్నాభిప్రాయాలు సైతం వ్యక్తమౌతున్నాయి. అలాంటిదేమీ ఉండకపోవచ్చని, కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని అర్చకుల నుంచి ఆశీర్వాదాలను పొంది ఉంటారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+