రైతులకు శుభవార్త.. 5 రోజుల్లో అకౌంట్‌లోకి డబ్బులు
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్ ఒకటోతేదీన జరిగే ఎన్నికలతో చివరి విడత ముగుస్తుంది. నాలుగో తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు, వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందనుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 16వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో వేశారు. ప్రస్తుతం 17వ విడత డబ్బులు రావాల్సి ఉంది.
16వ విడతలో రూ.21వేల కోట్లు
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాలుగైదు రోజులకే రైతులకు నిధులు విడుదల కానున్నాయి. 16వ విడతలో రైతులకు రూ.21వేల కోట్ల లబ్ధి కలిగింది. ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేలు అందుకుంటారు. పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి రూ.6వేలు అందుతాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలు వీటిని పొలంలో పంట వేసేందుకు అవసరమైన విత్తనాలు, తదితరాల కొనుగోలుకు ఉపయోగించుకోవాలి.

కొత్తగా నమోదు చేసుకోవాలనుకుంటే..
ఏప్రిల్- జులై, ఆగస్టు- నవంబర్, డిసెంబర్-మార్చి సమయంలో కేంద్రం వీటిని రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ సాయాన్ని రైతులు అందుకోవాలంటే ఈకేవైసీని పూర్తిచేయడం తప్పనిసరి. PMKISAN పోర్టల్‌లో OTP-బేస్డ్ eKYC అందుబాటులో ఉంది. అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inలో అన్ని వివరాలుంటాయి. ఏవైనా సందేహాలు ఉంటే 155261, 011-24300606 హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి 'న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్' ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. తర్వాత అవసరమైన వివరాలు నమోదు చేయాలి. ప్రధానమంత్రి కిసాన్ దరఖాస్తు ఫారంలో పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. అవసరమనుకుంటే దీన్ని ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలి.












Click it and Unblock the Notifications