నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి పేరెత్త‌ని ప్ర‌ధాని మోదీ: కెసిఆర్ -బాబు ద‌గ్గ‌ర అప్రెంటెస్ చేసారు: కొత్త సమీకరణాలు

|
Google Oneindia TeluguNews

ప్ర‌ధాని మోదీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తి క‌ర రాజ‌కీయం చోటు చేసుకుంది. తెలంగాణ లో కెసిఆర్ వర్సెస్ కాంగ్రెస్ -టిడిపి కూట‌మి గా హోరా హోరీ పోరు న‌డుస్తోంది. ఒక వైపు కెసిఆర్..మోదీ కి మిత్రుడంటూ కాంగ్రెస్ కూట‌మి నేత‌లు ఆరోపిస్తున్నారు. అయితే మోదీ మాత్రం కెసిఆర్..కాంగ్రెస్ ఇద్ద‌రూ ఒక్క‌టేనంటూ ఫైర్ అయ్యారు. కెసిఆర్ పై విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. కాంగ్రెస్ -టిఆర్‌య‌స్ ను టార్గెట్ చేసిన ప్ర‌ధాని..కాంగ్రెస్ తో జ‌త క‌ట్టిన టిడిపిని మాత్రం ఎక్క‌డా ఒక్క మాట అన‌లేదు. అవిశ్వాసం స‌మాధానం స‌మ‌యంలో కెసిఆర్ ప‌రిణితితో వ్య‌వ‌హ‌రించారు..చంద్ర‌బాబు గొడ‌వ‌లు పెట్టు కున్నార‌ని ఆరోపించిన మోదీ..ఇప్పుడు చంద్ర‌బాబు వ‌ద్ద కెసిఆర్ అప్రెంటిస్ చేసార‌ని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ - కెసిఆర్ టార్గెట్ గా..

కాంగ్రెస్ - కెసిఆర్ టార్గెట్ గా..

ప్ర‌ధాని మోదీ తెలంగాణ‌లో రెండు స‌భ‌ల్లో పాల్గొన్నారు. తొలుత నిజాబాద్ ఆ త‌రువాత మ‌హ‌బూబ్ న‌గ‌ర్ స‌భ‌ల్లో పాల్గొని ప్ర‌సంగించారు. కాంగ్రెస్ -కెసిఆర్ ను ల‌క్ష్యంగా చేసుకొని ప్ర‌సంగాలు కొన‌సాగించారు. కెసిఆర్ ఏ ప‌ని పూర్తి చేయ‌ర‌ని.. త‌న ప్ర‌భుత్వాన్ని పూర్తి కాలం కొన‌సాగించ‌లేద‌ని ఆరోపించారు. కెసిఆర్ పాల‌న లో నాలుగున్నారేళ్లు తెలంగాణ ఏం సాధించ లేద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ - టిఆర్‌య‌స్ రెండూ ఒక్క‌టేన‌ని..ఒకే నాణేనికి ఉన్న బొమ్మ బొరుసు వంటివి అంటూ ఫైర్ అయ్యారు. బిజెపికి ఓటు వేయ‌టం ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు. ఒక వైపు కెసిఆర్ .. ప్ర‌ధాని మోదీ ఇద్ద‌రూ ఒక్క‌టేన‌ని..రాజ‌కీయ మిత్రులంటూ కాంగ్రెస్ - టిడిపి కూట‌మి ప్ర‌చారం చేస్తుండ‌గా..స‌డ‌న్ గా మోదీ త‌న ప్ర‌నంగాల్లో ప్ర‌త్యేకంగా కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది. కెసిఆర్ మొత్తంగా చంద్ర‌బాబు.. కాంగ్రెస్ ను ల‌క్ష్యంగా చేసుకొని త‌న ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హిస్తున్నారు. కాగా, ఇప్పుడు ప్ర‌ధాని చేసిన విమ‌ర్శ‌లు వ్యూహా త్మ‌కమా..లేక కెసిఆర్ ల‌క్ష్యంగా మారారా అనే చ‌ర్చ మొద‌లైంది.

టిడిపి పేరు ప్ర‌స్తావించ‌లేదు..

టిడిపి పేరు ప్ర‌స్తావించ‌లేదు..

కొంత కాలంగా టిడిపి అధినేత చంద్ర‌బాబు..ప్ర‌తీ అడుగు ప్ర‌ధాని మోదీ టార్గెట్ గా వేస్తున్నారు. జాతీయ రాజ‌కీయాల్లో ..ఇటు ఏపిలో మోదీనే ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని సైతం క‌లి సి రాజ‌కీయంగా క‌లిసి న‌డ‌వాల‌ని నిర్ణ‌యించారు. తెలంగాణ లో కాంగ్రెస్ ను విమ‌ర్శించిన ప్ర‌ధాని..ఎక్క‌డా టిడిపి ని విమ‌ర్శించలేదు. చంద్ర‌బాబు...అదే కూట‌మి లో ఉన్న కోదండ‌రాం పార్టీ పేర్ల‌ను ప్ర‌స్తావించ‌లేదు. గ‌తంలో చంద్ర‌బాబు కంటే కెసిఆర్ ప‌రిణితి ఉన్న నాయ‌కుడ‌ని పేర్కొన్న ప్ర‌ధాని..ఇప్పుడు కెసిఆర్ ను ఇరుకున పెట్టేలా కెసిఆర్ తొలుత చంద్ర‌బాబు వ‌ద్ద ప‌ని చేసార‌ని..ఆ త‌రువాత కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో శిక్ష‌ణ పొందార‌ని విమ‌ర్శించారు. అయితే, కాంగ్రెస్ తో టిడిపి జ‌త క‌ట్ట‌టం పైనా..అదే విధంగా..కాంగ్రెస్ తో క‌లిసి పోటీ చేయ‌టం పైనాఎ ఎక్క‌డా మాట్లాడ లేదు. త‌న పై కొంత కాలంగా చంద్ర‌బాబు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ప‌రోక్షంగానూ ప్ర‌స్తావించ‌లేదు. ఏపి - తెలంగాణ కు కేంద్రం నుండి నిధులు భారీగా వ‌స్తాయ‌ని మాత్రం మోదీ హామీ ఇచ్చారు.

వ్యూహాత్మ‌కమా ... వెనుక‌డుగా..

వ్యూహాత్మ‌కమా ... వెనుక‌డుగా..

ప్ర‌ధాని మోదీ కాంగ్రెస్ ను త‌న ప్ర‌సంగాల్లో పూర్తిగా టార్గెట్ చేసారు. కెసిఆర్ ను హోమాలు నిర్వ‌హించ‌టం పైనా విమ‌ర్శ‌లు చేసారు. కానీ, కాంగ్రెస్ తో క‌లిసి పొత్తు పెట్టుకొపి..తెలంగాణ‌లో పోటీ చేస్తున్న టిడిపిని విమ‌ర్శించ‌క‌పోవ‌టం పై అనేక ర‌కాలుగా విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. తాను టిడిపిని ప‌ట్టించుకోన‌ని..తన పై చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు స‌మ‌ధా నం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌నే భావ‌న తోనే మోదీ టిడిపి పేరు ప్ర‌స్తావించ‌లేద‌ని బిజెపి నేత‌ల స‌మ‌ర్ద‌న‌గా ఉంది. అదే స‌మ‌యంలో.. తాను టిడిపి గురించి ప్ర‌స్తావించి..చంద్ర‌బాబు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు స్పంద‌న‌గా చూస్తార‌ని.. తాము అస‌లు టిడిపిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం లేద‌నే సంకేతాలిచ్చేందుకే మోదీ మాట్లాడ‌లేద‌ని క‌మ‌లం పార్టీ నేత లు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో...తెలంగాణ లో ఉన్న సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వార‌ని.. వారంతా 2014 లో బిజెపికే ఓటు వేసార‌ని..ఇప్పుడు చంద్ర‌బాబు ను..టిడిపిని విమ‌ర్శించ‌టం ద్వారా.. మ‌రింత‌గా వారి కి దూర‌మై..వారి మ‌ద్ద‌తు కోల్పోవ‌టం ఇష్టం లేక‌నే వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రించార‌నేది మ‌రో వాద‌న‌. అయితే, టిడిపి కి తెలంగాణ లో ఎటువంటి బ‌లం లేద‌ని..ఇప్పుడు ఏపిలో మోదీ పై పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త ఉన్న స‌మ‌యంలో తెలంగా ణ‌లో టిడిపి గురించి మాట్లాడ‌టం వ‌ల‌న రాజ‌కీయంగా ఎటువంటి ఉప‌యోగం లేద‌నే భావ‌న కూడా వ్య‌క్తం అవుతోంది.
మోదీ మరోసారి హైద‌రాబాద్‌లో ప్ర‌చారం కోసం వ‌స్తున్నార‌ని..అప్పుడు దీనికి స‌మాధానం లభిస్తుంద‌ని..టిడిపి- చంద్ర‌బాబు పై సంద‌ర్భం చూసి ప్ర‌ధాని స్పందిస్తార‌ని..బిజెపి నేత‌లు చెబుతున్నారు.

English summary
Prime Minister Modi in his Telangana election campaign targetted KCR and Congress. He does not mention TDP and Chandra Babu name in his speeches. Now this observation making politically new equations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X