ఏపీలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. అదుపుతప్పి బోల్తా !!

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో ప్రజలు మృతి చెందిన విషయం తీవ్రంగా కలిచివేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ గా
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పెళ్లకూరు సమీపంలోని దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ఈరోజు ( నవంబర్ 21, 2025 ) తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ప్రమాదం ఎలా జరిగింది?

ప్రాథమిక సమాచారం మేరకు.. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దొడ్లవారిమిట్ట ప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయింది. బస్సు రహదారి అంచునకు రావడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.

private-travel-bus-accident-at-tirupathi-district-and-news-got-viral

స్థానికుల సమాచారం మేరకు వెంటనే స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది, క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగతా వారందరికీ తేలికపాటి గాయాలే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను విచారిస్తున్నారు.

వరుస ప్రమాదాలతో ఆందోళన..

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, కర్నూలు జిల్లా బెంగళూరు హైవేపై జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది సజీవదహనం కావడం రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ ఘటన తర్వాత కూడా పలుచోట్ల చిన్న, పెద్ద ప్రమాదాలు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన తరువాత మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ సంస్థ ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను బాధితుల కుటుంబాలకు అందుబాటులో ఉంచినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+