నిన్న హీరోయిన్.. నేడు నిర్మాత.. ఏపీ ప్రభుత్వ వాహనాల్లో ఏదైనా సాధ్యమే..!
సినిమా వాళ్లకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడంలో పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అయితే ఏకంగా సినిమా వాళ్లకు ప్రభుత్వ వాహనాలు ఏర్పాటు చేయడమే ఇప్పుడు సర్వత్ర విమర్శలకు దారి తీస్తోంది. ఏపీలో ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నటించిన నిధి అగర్వాల్ ప్రభుత్వానికి చెందిన వాహనంలో ప్రయాణించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. అది కూడా ఓ షాపింగ్ మాల్ కోసం ఆమె ప్రభుత్వం వాహనంలో ప్రయాణించింది.
Wtf Nidhi Agarwal visiting malls in Government Vehicles 🙏
— Syera (@NeelFannn) August 11, 2025
pic.twitter.com/fbw1Hd8Cg5
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల పన్నులతో నిర్వహించే వాహనాలను ఇలా హీరోయిన్ల కోసం వినియోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు చెందినదిగా భావిస్తున్న, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఒక వాహనంలో నాగవంశీ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.నటి నిధి అగర్వాల్ ఘటన మరువకముందే ఈ కొత్త వీడియో బయటపడటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అధికారిక హోదా లేని వ్యక్తి ప్రభుత్వానికి చెందిన లేదా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనాన్ని ఉపయోగించడంపై పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ విషయంపై మంత్రి అనగాని సత్యప్రసాద్, నాగవంశీ నుంచి ఎటువంటి అధికారిక వివరణ రాలేదు. ఈ వీడియోల పట్ల నెటిజన్ల నుంచి వస్తున్న కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి.వైసీపీ శ్రేణులు మాత్రం దీనిపై ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. మా ఏపీలో అంతే సార్.. ఏదైనా సాధ్యమే అంటూ కూటమి ప్రభుత్వానికి కౌంటర్స్ వేస్తున్నారు.
ఎమ్మెల్యే స్టిక్కర్ వాహనంలో నిర్మాత నాగవంశీ
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025
నటి నిధి అగర్వాల్ ఘటన మరవకముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నిర్మాత నాగవంశీకి చెందిన మరో వివాదాస్పద వీడియో
ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్కి చెందిన కారుగా సమాచారం https://t.co/JvDTxWDGnD pic.twitter.com/EifIzQyJbX












Click it and Unblock the Notifications