ఒక్కొక్కరికి ఒక్కో రేటు .. వాట్సప్ ద్వారా అంతరాష్ట్ర హైటెక్ వ్యభిచారం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. చిత్తూరులో హైటెక్ వ్యభిచార ముఠాగుట్టును పోలీసులు పట్టుకున్నారు . అంతరాష్ట్ర వ్యభిచార దందా నిర్వహిస్తున్న పలువురు యువతులను పోలీసులు పక్కా వ్యూహంతో పట్టుకున్నారు. ఈ హైటెక్ వ్యభిచార ముఠా కార్యాకలాపాలు ఎలా సాగిస్తుందంటే ..

వాట్సాప్ ద్వారా వ్యభిచార దందా
సోషల్ నెట్వర్కింగ్ యాప్ అయిన వాట్సాప్ ద్వారా ఈ వ్యభిచార ముఠా కార్యకలాపాలను కొనసాగిస్తుంది. అందమైన యువతుల ఫోటోలను వాట్స్అప్ ద్వారా షేర్ చేయడం, విటులను ఆకర్షించడం, ఇక వీరికి ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి వీటిలో ఎక్కడికి పంపించమంటే అక్కడికి పంపించడం చేస్తూ మొబైల్ ఫోన్ ద్వారా మొబైల్ హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు కొందరు.

చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులతో వ్యభిచారం
మురకంబట్టు కేంద్రంగా చిత్తూరు, తిరుపతి నగరాలకు చెందిన పలువురు యువతులను ఓ మహిళ వ్యభిచార రొంపిలోకి దింపింది. వాట్సాప్ ద్వారా వారి నగ్న ఫోటోలను షేర్ చేసి విటులను ఆకర్షిస్తుంది.ఇక వీరి ద్వారా వ్యభిచార దందా సాగిస్తుంది. ఇతర రాష్ట్రాలకు సైతం వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలను పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎస్పీ సెంథిల్ కుమార్ కు వచ్చిన సమాచారంతో పక్కా ప్లాన్ తో ఈ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు.

మురకంబట్టు కు చెందిన మహిళ కీ రోల్
మురకంబట్టు కు చెందిన స్థానికంగా అందరికీ తెలిసిన ఓ మహిళ ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విటులు గా మగ పోలీసులను పంపించి, మఫ్టీలో ఆడ పోలీసులను నిఘా ఉంచి చాకచక్యంగా ఈ ఈ గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. ఇక వాట్సాప్ గ్రూపు లో వీరి నెట్వర్కింగ్ చూసి పోలీసులు షాక్ తిన్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ మీరు కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించారు.

రేటు కార్డులతో , ఇతర రాష్ట్రాలకు పంపి మరీ దందా
వ్యభిచారం చేస్తున్న మహిళలు వయసును బట్టి, అందాన్ని బట్టి రేటు ఫిక్స్ చేసి వారి ఫోటోలను పంపి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఐదు వేల రూపాయల నుండి 30 వేల రూపాయల వరకు రేట్ కార్డులను కూడా ఇచ్చి, ఇతర రాష్ట్రాలకు పంపి మరీ వ్యభిచారం చేస్తూ ఉండడం గుర్తించిన పోలీసులు, ఈ హైటెక్ ముఠా నిర్వాహకురాలిని సైతం అరెస్ట్ చేశారు. ఇంకా ఆమె ఎక్కడ ఎక్కడ తన నెట్వర్క్ ను విస్తరించిందో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ దందా చేస్తున్న యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి మరీ వారిని తమ స్వగ్రామాలకు చేరుస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications