పీఎస్సార్ కస్టడీలో బిగ్ ట్విస్ట్ - హుటాహుటిన..!!
మాజీ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు విచారణ వేళ కొత్త ట్విస్టులు చోటు చేసుకొంటు న్నాయి. ముంబాయి నటి జెత్వానీ కేసులో పీఎస్సార్ అరెస్ట్ అయ్యారు. పోలీసుల అభ్యర్దిన మేరకు కస్టడీకీ కోర్టు అనుమతించింది. మరింత విచారణ ద్వారా కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. కోర్టు అనుమతితో పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొన విచారణకు సిద్దం అవుతున్న వేళ ఊహించని పరిణామాలు జరిగాయి.
పీఎస్సార్ ఆంజనేయులు విచారణ వేళ ఆసక్తి కర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జెత్వానీ కేసులో పోలీసులు మాజీ నిఘా బాస్ పీఎస్సార్ ను అరెస్ట్ చేసారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ కోసం కస్టడీకి కోరారు. కోర్టు అనుమతితో విచారణ కు అధికారులు సిద్దమయ్యారు. ఇదే సమయంలో పీఎస్సార్ అస్వస్థతకు గురయ్యారు. హైబీపీ రావటంతో ఆయన స్వల్ప అస్వస్థత కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో, కస్టడీకి తీసుకునే సమయంలో విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స తరువాత కస్టడీకి కాకుండా తిరిగి జైలుకు పంపారు. ప్రస్తుతం పీఎస్సార్ తిరిగి జైలులో ఉన్నారు.

పీఎస్సార్ ఆంజనేయులు ను మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలనే సీఐడీ పోలీసుల అభ్యర్ థనను విజయవాడ కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం కోర్టటు ఆదేశాలతో ఆయనను శని, ఆది, సోమవారం కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావించారు. న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నటి జత్వానీ కేసులో విజయవాడ సీఐడీ కార్యాలయంలో నిందితుడు ఆంజనేయులు ప్రశ్నించేందుకు సిద్దమయ్యారు. అయితే, ఆయన అస్వస్థతకు గురి కావటంతో ఆస్పత్రికి అటు నుంచి జైలుకు తీసుకెళ్లారు. ముంబై నటి జత్వానీని బెదిరించి అక్రమంగా కేసులు పెట్టారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు విద్యాసాగర్ కి పీఎస్సార్ కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఐడీ అధికారులు విచారించనున్నారు.












Click it and Unblock the Notifications